Begin typing your search above and press return to search.

నాగార్జున ఫేస్‌తో 'కూలీ'కి ఫుల్‌ డిమాండ్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   8 March 2025 9:34 AM IST
నాగార్జున ఫేస్‌తో కూలీకి ఫుల్‌ డిమాండ్‌
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 1న విడుదల కాబోతున్న కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ భారీగా ఉంది. తమిళనాట ఈ సినిమాకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అందుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కూలీ సినిమాకు అన్ని చోట్ల భారీగా బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ సినిమాలకు మంచి స్పందన దక్కిన విషయం తెల్సిందే. అందుకే కూలీ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం కోసం రెడీ అయిందట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్‌ కూలీ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు గాను డబ్బింగ్ హక్కులు ఏకంగా రూ.40 కోట్లు పలికినట్లు సమాచారం అందుతోంది. ఒకప్పుడు తమిళ్‌తో సమానంగా తెలుగులోనూ రజనీకాంత్‌ సినిమాలకు వసూళ్లు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ రోబో తర్వాత తెలుగులో రజనీకాంత్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోతున్నాయి. తమిళ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం తెలుగులో ఒక మోస్తరు వసూళ్లను నమోదు చేయడంలో విఫలం అయ్యాయి. అందుకే రజనీకాంత్‌ కూలీ సినిమా తెలుగు మార్కెట్‌లో ఎంత బిజినెస్ జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

'కూలీ' సినిమాకి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించడంతో పాటు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో నటించడం వల్ల ఆసక్తి పెరిగింది. తెలుగు హీరో నాగార్జున నటించిన సినిమా కనుక కూలీ సినిమాకు తెలుగు మార్కెట్‌లో సహజంగానే భారీగా బజ్ క్రియేట్‌ అయింది. అంతే కాకుండా రజనీకాంత్‌, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, శివ కార్తికేయన్‌ను ఈ సినిమాలో నటించడంతో భారీ మల్టీ స్టారర్‌ మూవీగా ప్రచారం జరుగుతోంది. కనుక తెలుగు మార్కెట్‌లో భారీ ఎత్తున బజ్‌ క్రియేట్‌ చేయగలిగింది. అందుకే కూలీ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ హక్కులు రూ.40 కోట్ల పలికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

సినిమా విడుదల సమయంకు ప్రమోషన్స్‌తో బజ్‌ పెంచి, నాగార్జున పాత్రను మరింత బలంగా చూపించే ప్రయత్నం చేస్తే కచ్చితంగా సినిమాకు తెలుగు మార్కెట్‌లో మరింతగా రేటు పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో కూలీ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్ యూనివర్స్ నుంచి రాబోతున్న ఈ సినిమాలో మరికొందరు స్టార్‌ హీరోలు సైతం గెస్ట్‌లుగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ హీరోలు ఎవరు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.