Begin typing your search above and press return to search.

విశాఖ‌లో ముగించిన లొకేష్ క‌న‌గ‌రాజ్!

తాజాగా ఆ షెడ్యూల్ మొత్తం పూర్త‌యింది. వైజాగ్ షెడ్యూల్ పూర్త‌యిన విష‌యాన్ని శ్రుతిహాస‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 11:30 AM GMT
విశాఖ‌లో ముగించిన లొకేష్ క‌న‌గ‌రాజ్!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లొకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'కూలీ' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ వైజాగ్ లో నూ ఓ షెడ్యూల్ వేసి కొన్ని రోజులుగా అక్క‌డే షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కి సంబంధించి ర‌జ‌నీ పాత్ర ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి అయింది. ర‌జ‌నీ స‌హా కీల‌క న‌టులంతా పాల్గొన్నారు.

ఆ త‌ర్వాత పెండింగ్ షూట్ అంతి మిగ‌తా న‌టీనుల‌పై చేసారు. తాజాగా ఆ షెడ్యూల్ మొత్తం పూర్త‌యింది. వైజాగ్ షెడ్యూల్ పూర్త‌యిన విష‌యాన్ని శ్రుతిహాస‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. ఈ సినిమాకి సంబంధించిన త‌దుప‌రి షెడ్యూల్ ద‌స‌రా అనంత‌రం అక్టోబ‌ర్ 15 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అయితే షెడ్యూల్ మొద‌లైన వెంట‌నే ర‌జ‌నీకాంత్ జాయిన్ కారుట‌. షెడ్యూల్ మిడ్ లో జాయిన్ అవుతార‌ని స‌మాచారం.

ఇటీవ‌లే ర‌జ‌నీకి చిన్న శ‌స్త్ర చికిత్స జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్నిరోజులు ఆగితే పూర్తిగా కోలుకుంటారు. ఆ త‌ర్వాత య‌ధావిధిగా ఆటంకం లేకుండా షూట్ లో పాల్గొంటారు. ఇందులో ర‌జ‌నీకాంత్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాత్ర అవ‌స‌రం మే రకు కొన్ని రిస్కీ షాట్లు సైతం చేస్తున్నారు. సాధార‌ణంగా లోకేష్ సినిమాలంటే? హీరోల‌కు ప‌ని ఎక్కువ‌గానే ఉంటుంది.

స‌న్నివేశాల ప‌రంగా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ర‌జ‌నీ కాంత్ ని మ‌రీ అంత క‌ష్ట‌పెట్ట‌క‌పోయినా? త‌న‌కు కావాల్సిన ఔట్ ఫుట్ వ‌చ్చే వ‌ర‌కూ వ‌దిలి పెట్టే ర‌క‌మైతే కాదు. 70 లో కూడా ర‌జ‌నీ కాంత్ దూకుడు ఏమాత్రం త‌గ్గించ‌లేదు. పాత్ర ప‌రంగా ద‌ర్శ‌కులు అడిగివ‌న్నీ చేస్తున్నారు.