70 ప్లస్ లో సూపర్ స్టార్ దూకుడు మామూలుగా లేదే!
70 ప్లస్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎనర్జీ పీక్స్ లోనే ఉంది. ఆన్ సెట్స్ లోనే కాదు..ఆఫ్ ది సెట్స్ లోనూ డాన్సులు ఇరగదీస్తున్నారు.
By: Tupaki Desk | 15 Sep 2024 3:33 PM GMT70 ప్లస్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎనర్జీ పీక్స్ లోనే ఉంది. ఆన్ సెట్స్ లోనే కాదు..ఆఫ్ ది సెట్స్ లోనూ డాన్సులు ఇరగదీస్తున్నారు. ఇటీవలే అంబానీ ఇంట పెళ్లి వేడుకలో రజనీ ఏ రేంజ్ లో స్టెప్పులేసారో? తెలిసిందే. పెళ్లికొచ్చిన అతిధులతో పాటు రజనీకా కూడా స్టెప్ అందుకుని వేడుకను మరింత ఉత్సాహ పరిచారు. అది చూసినా కొన్ని క్షణాల పాటు ప్రేక్షకులు స్టన్ అయిపోయారు. అంబానీ ఇంట రజనీకాంత్ డాన్సు చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు.
సినిమాలో తప్ప బయట డాన్సు చేయడం ఎప్పుడూ కనిపించకపోవడంతోనే అలాంటి సన్నివేశం కనిపించింది. చివరికి తన కుమార్తెల పెళ్లి సమయంలో కూడా అలాంటి స్టెప్పులు వేయలేదు. అందుకే అంత ఆశ్చర్యం. ఇక `వేట్టయాన్` సినిమాలో మంజువారియర్ తోనే డాన్సులు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇది అభిమానులకు మరో రకమైన సర్ ప్రైజ్. తాజాగా మరోసారి కూలీ సెట్స్ లోనే అదే సన్నివేశాన్ని రిపీట్ చేసారు సూపర్ స్టార్.
శుక్రవారం నుంచి కేరళలో` ఓనం` పండగ మొదలైన సంగతి తెలిసిందే. ఈ పండుగను సూపర్ స్టార్ కూలీ సెట్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. కేరళ సంప్రదాయం పంచె కట్టులో ఓనం వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. తన రీసెంట్ సూపర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు వేసి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసారు. దానికి సంబం ధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
రజనీలో ఈ ఉత్సాహం చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. 70 ప్లస్ లో ఈ దూకుడేంటి? సార్ అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగత తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఇందులో గోల్డ్ స్మగ్లర్ పాత్రలో రజనీ కనిపించనున్నారు. ఇప్పటికే లీకైన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.