Begin typing your search above and press return to search.

రజనీకాంత్‌, ధనుష్‌ తండ్రి కొడుకులుగా...!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, స్టార్‌ హీరో ధనుష్‌ లు మాజీ మామ అల్లుడు అనే విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   2 Sep 2024 9:30 PM GMT
రజనీకాంత్‌, ధనుష్‌ తండ్రి కొడుకులుగా...!
X

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, స్టార్‌ హీరో ధనుష్‌ లు మాజీ మామ అల్లుడు అనే విషయం తెల్సిందే. రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య ను ధనుష్ పెళ్లి చేసుకోవడం, సుధీర్ఘ వైవాహిక జీవితం కు ధనుష్ దంపతులు స్వస్థి చెప్పి ఎవరి జీవితాన్ని వారు ఒంటరిగా సాగిస్తున్న విషయం కూడా అందరికి విధితమే. ఐశ్వర్య తో ధనుష్ విడాకులు తీసుకోక ముందు రజినీకాంత్‌ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. మామ అల్లుడు ఇద్దరు కూడా కలిసి నటించేందుకు ఆసక్తి చూపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఎప్పుడు కూడా ముందు పడలేదు.

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తాజా చిత్రం ది గోట్‌ సినిమా ను రజినీకాంత్‌, ధనుష్‌ లు తండ్రి కొడుకులుగా చేయాల్సి ఉందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకట్‌ ప్రభు చెప్పుకొచ్చాడు. ది గోట్‌ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్‌ లో భాగంగా దర్శకుడు వెంకట్‌ ప్రభు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఈ కథను రజినీకాంత్‌ తండ్రి పాత్రలో, ధనుష్ ను కొడుకు పాత్రలో ఊహించుకుంటూ రాశాను. కరోనా సమయంలో ఈ కథను వారి వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాను. కానీ కాలం కలిసి రాకపోవడంతో వారితో ఈ ప్రాజెక్ట్‌ ముందు పడలేదు.

కథ లో కొన్ని మార్పులు చేసి తండ్రి, కొడుకుగా విజయ్‌ ని నటింపజేసి ఈ సినిమాను రూపొందించాను. ది గోట్‌ సినిమా షూటింగ్‌ సమయంలో విజయ్‌ నుంచి చాలా సహకారం దక్కింది. ఆయన రెండు పాత్రల్లో కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు. విజయ్‌ ఇప్పటికే రాజకీయ అరంగేట్రంకు సిద్ధం అయ్యాడు. ఆయన పార్టీని ప్రారంభించి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలాంటి సమయంలో రూపొందిన ది గోట్‌ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. డబుల్‌ రోల్‌ లో విజయ్‌ ను చూస్తే ఫ్యాన్స్, ప్రేక్షకులు కచ్చితంగా సర్‌ప్రైజ్‌ అవుతారని దర్శకుడు వెంకట్‌ ప్రభు చెప్పుకొచ్చాడు.

రజినీకాంత్‌, ధనుష్ లు తండ్రి కొడుకులుగా ది గోట్ లో చేసి ఉంటే కచ్చితంగా ఇప్పుడు ఉన్న క్రేజ్ కంటే మరింత ఎక్కువ ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అయినా రజినీకాంత్‌, ధనుష్ లు కలిసి నటిస్తే చూడాలని తమిళ సినీ జనాలతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ది గోట్‌ ను వారి నుంచి తీసుకున్న విజయ్‌ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో ప్రభుదేవా, ప్రశాంత్‌, స్నేహా, అజ్మల్‌ అమీర్‌, మనోబాల, యోగిబాబు, వైభవ్‌ ఇంకా ప్రముఖ నటీనటులు నటించారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, కల్పాతి, అఘోరమ్‌ లు భారీ బడ్జెట్‌ తో నిర్మించారు.