Begin typing your search above and press return to search.

రజినీ కాన్ఫిడెన్స్.. ఫ్యాన్స్ ఖుషి..!

ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజిని ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 5:30 PM GMT
రజినీ కాన్ఫిడెన్స్.. ఫ్యాన్స్ ఖుషి..!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో టీ జీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వేటయ్యన్ ది హంటర్. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా, అమితాబ్ నచ్చన్ లాంటి స్టార్స్ నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజిని ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.

ముందుగా స్పీచ్ ఎత్తుకున్న రజినీ వేటయ్యన్ సినిమా ప్రొడక్షన్ లైకా ప్రొడక్షన్ సంస్థకు ఇందులో నటించిన రానా, మంజు వారియర్, సహా ఇతర నటీనటులకు టెక్నిషియన్స్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు అన్నారు. ఒక సినిమా హిట్ తర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్టర్ ప్రొడ్యూసర్ లో టెన్షన్ ఉంటుంది. ఎలాగైనా సరే హిట్ సినిమా ఇవ్వాలని అనుకుంటారు. అయితే అలానే హిట్ తర్వాత మరో హిట్ సినిమా ఇవ్వాలని ఉంటుంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్ని కుదిరితేనే అలా సక్సెస్ అవుతుంది. జైలర్ కి ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత చాలా కథలు విన్నా ఆ టైం లో జ్ఞానవేల్ తనతో సినిమా చేయాలని అనుకున్నాడని తెలిసిందని అన్నారు రజినీ.

జై భీమ్ చూసినా డైరెక్టర్ కి ఫోన్ చేయలేదు. కానీ సౌందర్య జ్ఞానవేల్ దగ్గర లైన్ ఉందని వినమని చెప్పింది. ఐతే ఆ టైం లో మరోసారి జై భీమ్ చూశాను. అతను డైరెక్టర్ కంటే ముందు ఓ జర్నలిస్ట్ అని తెలిసింది. తర్వాత జ్ఞానవేల్ ని కలిశాను. ఐతే తనతో సందేశాత్మక సినిమా తీయడం కాదు కమర్షియల్ సినిమా తీయాలని.. అందుకు తగినట్టుగా తన స్టైల్ కు తగినట్టుగా వేటయ్యన్ చేశారని అన్నారు రజినీకాంత్.

జ్ఞానవేల్ కథ చెప్పగానే నచ్చింది. లోకేష్, నెల్సన్ స్టైల్ లో కమర్షియల్ సినిమా చేయలేను కానీ నా స్టైల్ లో చేస్తానని అన్నాడు. నాకు అదే కావాలని చెప్పడంతో కథ సిద్ధం చేశాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ గారు యాడ్ అవ్వడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అమితాబ్ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నాకు ఇన్ స్పిరేషన్ అన్నారు రజినీ. ఫాహద్ ఒక మంచి డిఫరెంట్ రోల్ లో నటించాడు. రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. కెమెరా ముందు యాక్టర్ గా బాగా చేస్తాడు. అనిరుద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. జ్ఞానవేల్ మంచి వ్యక్తి. తన కోసమైనా ఈ సినిమా హిట్ కావాలని అనుకుంటున్నా అన్నారు రజినీకాంత్. జ్ఞానవేల్ గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు.