సింహం వేటకు ముహూర్తం ఫిక్సైందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ -2`కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 March 2025 7:30 AMసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ -2`కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. `జైలర్` హిట్ అయిన అనంతరం నెల్సన్ పార్ట్ -2 పనుల్లోనే నిమగ్నమై పని చేస్తున్నారు. రజనీకాంత్ కూడా రెండవ భాగానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో మరో హీరో ఆలోచన లేకుండా నెల్సన్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది.
ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో తాజాగా రజనీకాంత్ డేట్లు కూడా కేటాయిం చినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఈ సినిమా తొలి షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమవుతుందని సమా చారం. యాక్షన్ సీక్వెన్స్ తో చిత్రీకరణ మొదలు పెడుతున్నారుట. అనంతరం తదుపరి షెడ్యూల్స్ గోవా, తేనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించనున్నారని సమాచారం. ఇందులో రజనీకాంత్ ముత్తవేల్ పాండియన్ గా కనిపించనున్నారు.
అలాగే `జైలర్` లో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు కూడా యధావిధిగా రెండవ భాగంలోనూ కొనసాగుతాయని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. వీటితో పాటు అదనంగా మరికొంత మంది స్టార్లు కూడా భాగమవుతున్నట్లు తెలుస్తోంది. జైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా సినిమా స్పాన్ పెంచినట్లు తెలుస్తోంది. `జైలర్` బాక్సాఫీస్ వద్ద 600 కో ట్లకు పైగా వసూళ్లను సాధించింది.
దీంతో పాన్ ఇండియాకి మరింత కనెక్టింగ్ ఉండేలా నెల్సన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ `కూలీ` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఈ నేపత్యంలోనే `జైలర్ 2` షూట్ కూడా డిలే అయింది.