సూపర్ స్టార్ కి నిద్రపట్టనివ్వని జయలలిత!
మరి అలాంటి నటుడికే జయలలిత నిద్రపట్టకుండా చేసిందా? అంటే అవుననే సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 10 April 2025 7:12 AMసూపర్ స్టార్ రజనీకాంత్ దేశంలో ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయంగానూ మార్కెట్ ఉన్న నటుడు. విదేశీ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేసిన తొలి సంచలనం సూపర్ స్టార్. కోట్లాది మంది అభిమానించిన నటుడు. నటుడిగా ఆయనో లెజెండ్. ఆఫ్ ది స్క్రీన్ లో ఆయన నడిచొస్తుంటే? సింహామే నడుస్తున్నట్లు ఉంటుంది. మరి అలాంటి నటుడికే జయలలిత నిద్రపట్టకుండా చేసిందా? అంటే అవుననే సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దివంగత మాజీ మంత్రి, సత్యమూవీస్ వ్యవస్థాపకుడు , నిర్మాత ఆర్ .ఎం వీరప్పన్ తొలి వర్దంతి సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. రజనీకాంత్ పై అభిమానం చూపించిన అతి కొద్ది మందిలో వీరప్పన్ ఒకరు. భాషా వంద రోజుల వేడుకలో సినిమాలో బాంబు స్కృతి మాట్లాడినప్పుడు ఆ వేదికపై వీరప్పన్ కూడా ఉన్నారు.
ఓ మంత్రి ఉన్న సమయంలో పబ్లిక్ వేదికలపై అలా మాట్లాడకూడదు అన్న సంగతి రజనీకాంత్ తెలియక మాట్లాడటంతో మంత్రిని జయలలిత పదవి నుంచి తొలగించారట. వేదికపై ఉండి కూడా రజనీకాంత్ అలా మాట్లాడకూడదని అడ్డు చెప్పే ప్రయత్నం వీరప్పన్ చేయకపో వడంతోనే పదవి కోల్పోయారని రజనీకాంత్ తెలిపారు. తనవల్లే ఇలా జరిగిందని ఆ రాత్రంతా రజనీకాంత్ కి నిద్రపట్టలేదన్నారు.
వీరప్పన్ కోసం రజనీకాంత్ జయలలితకు ఫోన్ చేసి మాట్లాడుతానని చెప్పినా వీరప్పన్ సున్నితంగా తిరస్కరించారట. ఆమె ఎవరు మాట వినదని ..మాట్లాడి గౌరవం కోల్పోవడం తనకు ఇష్టం లేక అలా చెప్పారన్నారు రజినీ కాంత్. జయలలితకు వ్యతిరేకంగా గళం విప్పడానికి చాలా కారణాలున్నా? ఇది ప్రధాన కారణంగా రజనీకాంత్ పేర్కొన్నారు.