Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమా.. సైలెంట్ గానే..

సూపర్ స్టార్ రజినీకాంత్ 73 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన సామర్ధ్యనికి మించి కష్టపడుతూ మూవీస్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 4:30 PM GMT
సూపర్ స్టార్ సినిమా.. సైలెంట్ గానే..
X

సూపర్ స్టార్ రజినీకాంత్ 73 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన సామర్ధ్యనికి మించి కష్టపడుతూ మూవీస్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒక సినిమా అయిన చేయాలని సూపర్ స్టార్ ప్లాన్ చేసుకున్నారు. గతంలో రజినీకాంత్ రెండు మూడు సార్లు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు వారిస్తున్న నటన మీద ఉండే ఇష్టం, ఫ్యాన్స్ అభీష్టం మేరకు సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీస్ చేస్తూ వస్తున్నారు.

టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ‘వేట్టయన్’ మూవీ అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఐదు భాషలలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫాహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ యాక్టర్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. దీంతో సినిమాపైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్ గా మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది.

అలాగే ‘వేట్టయన్’ సాంగ్ మనసిలాయో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా కంటెంట్ తో ప్రమోషన్స్ గట్టిగానే జరుగుతున్నాయి. కాని సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం బయటకొచ్చి ఈ సినిమా పబ్లిసిటీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. రీసెంట్ గా రజినీకాంత్ ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరారు. డాక్టర్స్ ఆయనకి స్టంట్స్ వేసారు. దీంతో రజినీకాంత్ ప్రస్తుతం హాస్పిటల్ లో రెస్ట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కి రజిని దూరంగా ఉండబోతున్నారు.

మిగిలిన యాక్టర్స్ తో కూడా ప్రమోషన్స్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ బ్రాండ్ ఇమేజ్ మీదనే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంట. కంటెంట్ మీద నమ్మకం ఉండటంతో పబ్లిసిటీని పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మూవీ రిలీజ్ తర్వాత వచ్చే మౌత్ టాక్ ద్వారానే ‘వేట్టయన్’ సినిమా జనాల్లోకి వెళ్ళాలి. తమిళ్, తెలుగు భాషలలో ఈ దసరాకి వస్తోన్న పెద్ద సినిమా ఇదే కాబట్టి సాలిడ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయని అనుకుంటున్నారు.

రజినీకాంత్ హెల్త్ ఇష్యూస్ కారణంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘కూలీ’ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దాని తర్వాత డాక్టర్స్ సూచన మేరకు అతని నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఉండొచ్చని భావిస్తున్నారు.