సూపర్ స్టార్ కోసం అతిలోక సుందరి వారం రోజులు ఉపవాసం!
సూపర్ స్టార్ రజనీకాంత్-అతిలోక సుందరి శ్రీదేవి మధ్య స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 24 Oct 2024 10:30 PM GMTసూపర్ స్టార్ రజనీకాంత్-అతిలోక సుందరి శ్రీదేవి మధ్య స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆన్ స్క్రీన్ పై ఆ జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. 20కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. అలా నటించడమే ఇద్దరి మధ్య అంత గొప్ప స్నేహానికి దారి తీసింది. అనేక సందర్భాల్లో ఒకరి గురించి ఒకరు ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే రజనీకాంత్-శ్రీదేవి మధ్య ఏకంగా ఉపవాసం చేసేంత గొప్ప స్నేహం ఉందన్న? సంగతి మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అప్పట్లో రజనీకాంత్ నటించిన `రానా` చిత్రం సమయంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, శ్రీదేవి అతడి ఆరోగ్యంపై ఎంతో ఆందోళన చెందిందిట. త్వరగా కోలుకోవాలని ఎంతో మంది దేవుళ్లను మెక్కారుట. ఎన్నో ఆలయాలు సందర్శించారుట. ఆ తర్వాత 2011 లో మరోసారి షూటింగ్ లో ఉన్నప్పుడే రజనీ ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు రజనీకాంత్ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఇండియాలోనే ఉన్న శ్రీదేవికి ఈ విషయం తెలియగానే ఎంతో ఆందోళన చెందిందిట.
అప్పుడు త్వరగా కోలుకోవాలని షిర్డీ సాయిబాబాకు ప్రత్యేకమై పూజులు చేసిందిట. ఆ సమయంలో రజనీ అభిమా నులంతా కూడా దేశ వ్యాప్తంగా దేవుళ్లను ప్రార్ధించారు. అనంతరం ఆయన తిరిగి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ఇండియాకి వచ్చారు. అలాగే రజనీకాంత్ కూడా శ్రీదేవి గురించి ఓ తమాషా సంఘటన గురించి గుర్తు చేసారు. `శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె 7-8 సంవత్సరాల వయస్సులోనే నటన మొదలు మానేసి మళ్లీ తన 15 సంవత్సరాల వయస్సులో `మూండ్రు ముడిచు` (1976)తో తిరిగి నటించింది.
శ్రీదేవి తన తల్లితో కలిసి ప్రేమలయ ఆఫీస్ కి వచ్చింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. డైరెక్టర్ (బాలచందర్) సార్ రాగానే అందరూ లేచి నిలబడి పలకరించారు. శ్రీదేవి తల్లి ఆమెను గుడ్ మార్నింగ్ (డైరెక్టర్‌కి) చెప్పమని చెప్పారు. వెంటనే ఇక శ్రీదేవి 'గుడ్ మార్నింగ్ టీచర్` అని చెప్పింది. ఆ సంఘటన తర్వాత నేను చాలాసార్లు ఆమెను ఎగతాళి చేసాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే ఎంతో నవ్వొస్తుంది` అన్నారు.
అప్పట్లో రజనీకాంత్ శ్రీదేవికి ప్రపోజ్ చేయాలని అనుకున్నారుట. ఈ విషయాన్ని అప్పట్లో బాలచందర్ చెప్పారు. ఈ సందర్భంలో శ్రీదేవి ఇంట గృహ ప్రవేశం సందర్భంగా విషయం చెప్పాలనుకున్నారుట. కానీ ఇంట్లోకి వెళ్లగానే ఒక్కసారిగా కరెంట్ పోయిందిట. దీంతో ఇలా చీకటి కమ్ముకోవడం చెడు సంకేతంగా భావించి రజనీకాంత్ విషయం చెప్పకుండా వెనుదిరిగినట్లు బాలచందర్ తెలిపారు. ఆ ప్రేమ కాల క్రమంలో ఎంతో గొప్ప స్నేహంగా మారింది.