ఆయనతో సినిమా ఆ స్టార్ హీరోకి సాహసమే!
అయితే తాజాగా సూపర్ స్టార్ వెట్రీమారన్ ని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మారన్ తో ఓ సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నారుట.
By: Tupaki Desk | 23 Feb 2025 7:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా అంటే అది కచ్చితంగా రజనీని ఎలివేట్ చేసే కంటెంట్ అయి ఉండాలి. రజనీకాంత్ మాస్ ఇమేజ్ ఉన్న నటుడు. అలాంటి నటుడితో సినిమా అంటే? కంటెంట్ సహా సూపర్ స్టార్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే సీన్లు ఉండాలి. 'జైలర్' అంత పెద్ద సక్సెస్ అయిందంటే? కారణం ఆ రకమైన ఎలివేషన్ అన్నది అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత 'జైలర్' తోనే సూపర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ పడింది.
అంతకు ముందు...ఆ తర్వాత రిలీజ్ అయిన చిత్రాలేవి ఆశించిన ఫలితాలు సాధించలేదు అన్నది కాదనలేని నిజం. 'వెట్టేయాన్' చిత్రాన్ని కూడా అలాగే జనాలకు చూపించాలనుకుని రజనీకాంత్ చేతులు కాల్చుకున్న సంగతి తెలిజిందే. 'జైభీమ్' లాంటి సందేశాత్మక సినిమా చూసి జ్ఞాన్ వేల్ తో అద్భుతం చేద్దాం అనుకున్నాడు. కానీ 'వెట్టేయాన్' తో అది ప్రూవ్ కాలేదు. ఈ సినిమాకి రజనీకాంత్ ప్రత్యేకమైన రైటర్లను పెట్టి ఎలివేషన్ సీన్లు రాయించాడు.
ఎందుకంటే రజనీని కమర్శియల్ గా చూపించలేని జ్ఞాన్ వేల్ ముందే చెప్పేసారు. దీంతో కథ పరంగా ఎక్కడా వైఫల్యం లేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. కానీ రజనీ రీరైట్ చేయించిన సన్నివేశాలే పండలేదు. అయితే తాజాగా సూపర్ స్టార్ వెట్రీమారన్ ని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మారన్ తో ఓ సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నారుట. కానీ వెట్రీ మారన్ కమర్శియల్ సినిమాలు తీయలేడు.దర్శకుడిగా అతడికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అతడితో పని చేయాలని ప్రతీ హీరో కోరుకుంటాడు.
ఎన్టీఆర్ కూడా మారన్ తో ఓ సినిమా తీయాలని..తాను రెండీ అంటే తమిళనాడుకు వస్తానన్నాడు. అంత ఫేమస్ వెట్రీ మారన్. కానీ హీరోని కమర్శియల్ కోణంలో చూపించడంలో మాత్రం వెట్రీ మారన్ కి అంత గొప్ప ట్రాక్ రికార్డు లేదు. అందులోనూ రజనీకాంత్ భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని వెట్రీ మారన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేరు అన్న విమర్శ వ్యక్తమవుతుంది. ఇవన్నీ కాదని రజనీకాంత్ వెట్రీ మారన్ తో సినిమా చేస్తే అది సాహసమే అవుతుందంటున్నారు.