Begin typing your search above and press return to search.

ఏడు సార్లు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన సూప‌ర్ స్టార్!

దీంతో ర‌జ‌నీకాంత్ కెరీర్ లో 200 కోట్ల క్ల‌బ్ లో చేరిన ఏడ‌వ చిత్రంగా' వె ట్టేయాన్' నిలిచింది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 12:52 PM GMT
ఏడు సార్లు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన సూప‌ర్ స్టార్!
X

సెంచ‌రీ కొట్ట‌డం అంటే మాట‌లా? అందులోనూ డ‌బుల్ సెంచ‌రీ ల కోసం ఇంకెంత క‌ష్ట‌ప‌డాలి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మొన‌గాడు అని మ‌రోసారి రుజువైంది. ఇటీవ‌లే ఆయ‌న నుంచి రిలీజ్ అయిన వెట్టేయాన్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ తెచ్చింది. దీంతో ర‌జ‌నీకాంత్ కెరీర్ లో 200 కోట్ల క్ల‌బ్ లో చేరిన ఏడ‌వ చిత్రంగా' వె ట్టేయాన్' నిలిచింది.

అంత‌కు ముందు తలైవా న‌టించిన 'పెట్టా',' ద‌ర్బార్', 'ఎంథిర‌న్',' క‌బాలీ', 'జైల‌ర్',' రోబో2.0' లాంటి చిత్రాలు ఈ ఫీట్ ని సాధించాయి. 'పెట్టా', 'ద‌ర్బార్' లాంటి సినిమాలు యావ‌రేజ్ గా ఆడినా? ర‌జ‌నీ ఇమేజ్ తో 200 కోట్ల మార్క్ లో సునాయాసంగా చేర‌డం విశేషం. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి వ‌ర‌ల్డ్ వైడ్ ఫాలో యింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లోనూ త‌లైవా సినిమాలు దుమ్ముదులిపేస్తుంటాయి.

చైనా, మ‌లేషియా, జ‌పాన్, కొరియా దేశాల్లో , థాయ్ లాండ్ దేశాల్లో సూప‌ర్ స్టార్ ఇమేజ్ పీక్స్ లో ఉంది. ఆయ‌న స్టైల్ కి ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు...దేశ విదేశాల్లోనూ అభిమానులున్నార‌ని ఎన్నో సినిమాలు రుజువు చేసాయి. అందులో తొలుత బీజం వేసింది ముత్తు చిత్రం. అందులో త‌లైవార్ స్టైల్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అప్పటి నుంచి ర‌జ‌నీ సినిమాలు విదేశాల్లో క్ర‌మం త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతుంటాయి.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శక‌త్వంలో 'కూలీ' చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇందులో తైల‌వా గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర గ‌నుక క‌నెక్ట్ అయిందంటే? మళ్లీ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల వ‌ర‌దే.