Begin typing your search above and press return to search.

మాజీ మామ ఆ హీరోకే ఛాన్స్ ఇస్తాడా?

కానీ ఆ అరుదైన అవ‌కాశం ధ‌నుష్ కి రావ‌డంతో ఆయ‌న ఆనందాన్ని అవ‌దుల్లేవ్. ఈ ప్రాజెక్ట్ ని ధ‌నుష్ ఓ క‌ల‌గా భావించాడు

By:  Tupaki Desk   |   21 March 2024 9:11 AM GMT
మాజీ మామ ఆ హీరోకే ఛాన్స్ ఇస్తాడా?
X

ఎట్ట‌కేల‌కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌ట్లో ఆ లెజెండ‌రీ న‌టుడి బ‌యోపిక్ సాధ్య‌మేనా? అని ఎన్నో ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. అన్నింటికి పుల్ స్టాప్ పెడుతు ధ‌నుష్‌-అరుణ్ మాథేశ్వ‌ర‌న్ కాంబో ముందుకు రావ‌డంతో సాధ్య‌మైంది. ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్ ధ‌నుష్ కి వ‌స్తుందా? మ‌రో న‌టుడికి వ‌స్తుందా? అన్న ఎన్నో ర‌కాల సందేహాలు ఉండేవి.

కానీ ఆ అరుదైన అవ‌కాశం ధ‌నుష్ కి రావ‌డంతో ఆయ‌న ఆనందాన్ని అవ‌దుల్లేవ్. ఈ ప్రాజెక్ట్ ని ధ‌నుష్ ఓ క‌ల‌గా భావించాడు. ఇప్పుడా డ్రీమ్ నెర‌వేరుతుంది. ధ‌నుష్ లో అస‌లైన న‌టుడ్ని మ‌రోసారి తెర‌పై ఆవిష్క‌రించ బోతున్నాడు. అయితే ధ‌నుష్ కి మ‌రో డ్రీమ్ కూడా ఉంది. అత‌ను కూడా ఎప్పుడు ఒకే చెబుతాడా? అని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న‌ట్లు అత‌డి మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ జీవిత క‌థ‌లు కూడా ఎప్పుడు న‌టిస్తానా? అని ఇప్ప‌టి నుంచి వె యిట్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇళ‌య‌రాజా త‌ర్వాత తాను ర‌జ‌నీ జీవితంలో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపాడు. ఇళ‌య‌రాజా తో పాటు త‌న డ్రీమ్ లో ర‌జ‌నీ కూడా ఉన్నార‌ని అన్నాడు. దీంతో ధ‌నుష్ దృష్టిలో ఇద్ద‌రు చెరో క‌న్ను అని తెలుస్తోంది. కుడి క‌న్ను ఇళ‌యారాజా అయితే...ఎడ‌మ క‌న్ను ర‌జ‌నీకాంత్ అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ద‌నుష్..ర‌జ‌నీకాంత్ అంగీకారం కోసం కూడా ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రి ఆ ఛాన్స్ ధ‌నుష్ కే ఇస్తాడా? లేక మ‌రో న‌టుడికి ఉంటుందా? అన్న‌ది ర‌జ‌నీ చేతుల్లోనే ఉంది. అలాగే ఆయ‌న జీవిత క‌థ‌ని ఇప్పుడే చూడాల‌నుకుంటున్నారా? ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల‌ను కుంటున్నారా? అన్న‌ది తెలియ‌ని అంశం. కానీ ధ‌నుష్ మాత్రం ఆ ఛాన్స్ త‌న‌కే రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.ర‌జ‌నీ కాంత్-ధ‌నుష్ ఇద్ద‌రు మాజీ మామ‌-అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. ఐశ్వ‌ర్య‌ర‌జ‌నీకాంత్ -ధ‌నుష్ వివాహం..విడిపోయిన సంగ‌తి విధిత‌మే. మ‌రి ఇలాంటి స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ర‌జ‌నీ ఆ ఛాన్స్ ధ‌నుష్ కి ఇస్తాడా? అన్న‌ది ఆస‌క్తిక‌ర అంశ‌మే.