Begin typing your search above and press return to search.

జైలర్ తమన్నా ఫ్యాన్స్ కి బోనస్..!

సూపర్ స్టార్ రజినికాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న జైలర్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:12 AM GMT
జైలర్ తమన్నా ఫ్యాన్స్ కి బోనస్..!
X

సూపర్ స్టార్ రజినికాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న జైలర్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 600 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటన్నది చూపించారు తలైవా రజిని. రోబో తర్వాత రజిని సినిమా కలెక్షన్స్ హడావిడి చేయడం ఇదే అని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహంగా ఉండగా జైలర్ వారి ఆకలి తీర్చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా క్లాస్ గా కనిపించి ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించేలా మాస్ అంశాలతో నెల్సన్ అదరగొట్టాడు.

జైలర్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి జోష్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కాగా లేటెస్ట్ గా సినిమా ఓటీటీలో రిలీజైంది. అమేజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకే జైలర్ డిజిటల్ రైట్స్ ని అందుకుంది. ఈ సినిమా ఓటీటీ వర్షన్ తమన్నా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. సినిమా ఎడిటింగ్ లో తమన్నా సీన్స్ కొన్ని ట్రిమ్ చేయాల్సి వచ్చిందట. అయితే డిజిటల్ వర్షన్ లో ఆ సీన్స్ యాడ్ చేశారు. తమన్నాతో సీన్స్ ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.

జైలర్ డిజిటల్ వెర్షన్ కూడా సూపర్ హిట్ అనిపించుకుంటుంది. సినిమాలో రజిని స్వాగ్ చూసి వావ్ అనేస్తున్నారు డిజిటల్ ఆడియన్స్. సినిమాను భారీ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా లాభాల్లో కూడా హీరో రజినికాంత్ కు.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి కొంత వాటా ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. అంతేకాదు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా కూడా ప్లానింగ్ లో ఉన్నాడట ప్రొడ్యూసర్. జైలర్ హిట్ తమన్నాకి కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ హిట్ తో తమన్నాకు మళ్లీ కోలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయట.

జైలర్ సినిమా తర్వాత రజినికాంత్ లాల్ సలాం సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో ఆయనది గెస్ట్ రోల్ అయినా జైలర్ ఎఫెక్ట్ తో ఆ మూవీపై అంచనాలు పెరిగాయి. రజిని కూతురు ఐశ్వర్య రజినికాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలాం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.