రజినీకాంత్.. ఇలా చేస్తే తప్పేంటి?
రజినీకాంత్ కి జైలర్ కంటే ముందు చివరిగా వచ్చిన సక్సెస్ అంటే రోబో అని చెప్పాలి. ఆ తరువాత చాలా ఫ్లాప్ లు వచ్చిన సూపర్ స్టార్ ఇమేజ్ అయితే ఎక్కడ చెక్కుచెదరలేదు.
By: Tupaki Desk | 15 Feb 2024 4:04 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా ఏ మాత్రం రజినీకాంత్ ఇమేజ్, మార్కెట్ కి తగ్గట్లు లేవని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ చిత్రానికి జీరో షేర్ వచ్చింది. దీంతో రజినీకాంత్ అనవసరమైన సినిమాలతో రిస్క్ చేస్తూ అతని ఇమేజ్ పాడుచేసుకుంటున్నాడు అనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.
రజినీకాంత్ ఫ్లాప్ సినిమాలు చేసినంత మాత్రాన ఇప్పుడు అతని ఇమేజ్ కి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పాలి. ఇండియాలోనే టాప్ హీరోలలో ఒకడిగా, ప్రతి ఒక్కరు గౌరవించి, ప్రపంచ స్థాయిలో గుర్తుపట్టే వ్యక్తిగా రజినీకాంత్ ఉన్నారు. సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు రజినీకాంత్ అంటే వెంటనే సూపర్ స్టార్ అని చెప్పే రేంజ్ ని అందుకున్నారు. అంతకు మించిన స్థాయి ఇక ఉండదని చెప్పాలి.
గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ మూవీతో రజిని స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. గతంలో డాన్స్ లు వేస్తూ, హీరోయిన్స్ తో డ్యూయెట్స్ పాడిన మూవీస్ ఏవీ పెద్దగా సక్సెస్ కాలేదు. రజినీకాంత్ కి జైలర్ కంటే ముందు చివరిగా వచ్చిన సక్సెస్ అంటే రోబో అని చెప్పాలి. ఆ తరువాత చాలా ఫ్లాప్ లు వచ్చిన సూపర్ స్టార్ ఇమేజ్ అయితే ఎక్కడ చెక్కుచెదరలేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ వయస్సు 73 ఏళ్ళు. ఈ ఏజ్ లో హీరోగా చేయడమే గొప్ప విషయం అని చెప్పాలి. మరో 7 ఏళ్ళు ఇంకా మంచి కెరీర్ ఉంటుంది.. ఫిట్నెస్ సపోర్ట్ చేస్తే తొమ్మిదేళ్లు కూడా చేయవచ్చు. ఈ వయస్సులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాకుండా కొత్తదనం ఉన్న కథలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే ఆయన ఇమేజ్ కి మరింత ప్లస్ అవుతుంది తప్ప తగ్గదు.
తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ని డైరెక్టర్ గా ప్రమోట్ చేయడానికి తండ్రిగా సపోర్ట్ చేశాడు. ధనుష్ తో విడిపోయి డిప్రెషన్ లో ఉన్న ఆమెకి అండగా నిలబడి ఆ ఆలోచనల నుంచి సినిమా మాధ్యమం ద్వారా బయటపడేలా సూపర్ స్టార్ చేశారు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే తండ్రిగా కూతురికి రజినీకాంత్ అండగా నిలబడి ఒక నటుడిగా తాను చేయగలిగింది చేసాడు.
ఈ విషయంలో రజినీకాంత్ ని మెచ్చుకొని తీరాల్సిందే. హిట్ ఫ్లాప్స్ అనేవి సహజం. కాకపోతే చేసిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఆ దిశగా రజినీకాంత్ నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ జ్ఞాన్ వేల్ రాజాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు మళ్ళీ అతనికి సక్సెస్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అప్పుడప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఈ జెనరేషన్ హీరోల సినిమాలలో కూడా చేస్తూ సపోర్ట్ ఇస్తే ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆదరించే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.