Begin typing your search above and press return to search.

'వెట్టేయాన్' వేట‌కు తేదీ ఫిక్సైంది

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 170వ చిత్రం రిలీజ్ పై కొన్ని నెల‌లుగా ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2024 5:10 AM GMT
వెట్టేయాన్ వేట‌కు తేదీ ఫిక్సైంది
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 170వ చిత్రం రిలీజ్ పై కొన్ని నెల‌లుగా ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ పార్ట్ షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ తేదీపై క్లారిటీ రాలేదు. దీంతో అభిమానుల్లో రిలీజ్ పై ఆస‌క్తి అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఆదివార‌మే అప్ డేట్ ఇస్తామంటూ యూనిట్ రివీల్ చేసింది. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు.


ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. నేటితో రిలీజ్ స‌స్పెన్స్ కి తెర ప‌డింది. అంటే రిలీజ్ కి ఇంకా రెండు నెల‌లు స‌మ‌యం ఉంది. ఈ గ్యాప్ లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేయ‌నున్నారు. అలాగే ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెడ‌తార‌ని తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ సినిమాకి సంబంధించి గ్లింప్స్ ఏవీ రిలీజ్ కాలేదు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మిన‌హా క్రేజీ అప్ డేట్స్ ఏవీ రాలేదు. తాజాగా రిలీజ్ తేదీ తో పాటుర‌జ‌నీ కొత్త పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. పోస్ట‌ర్ లో ర‌జ‌నీ పోలీస్ గెట‌ప్ లో క‌నిపిస్తున్నారు. ర‌జ‌నీ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఇక‌పై యూనిట్ సినిమాని జ‌నాల్లోకి వీలైనంత వేగంగా తీసుకేళ్లె ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇప్ప‌టికే లైకా ప్రొడ‌క్ష‌న్స్ లో ర‌జ‌నీ మూడు సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `2.0`ని ఇదే సంస్థ నిర్మించింది. అలాగే ముర‌గదాస్ ద‌ర్శక‌త్వంలో `ద‌ర్బార్` కూడా నిర్మించింది.

ఆ మ‌ధ్య రిలీజ్ అయిన `లాల్ స‌లామ్` కూడా ఇదే సంస్థ నుంచి రిలీజ్ అయింది. కానీ ఇవేవి ఆ సంస్థ‌కు భారీ లాభాలు తెచ్చి పెట్ట‌లేదు. దీంతో సూప‌ర్ స్టార్ `వెట్టేయాన్` తో అన్ని లెక్క‌లు స‌రిచేయాల‌ని మ‌రోసారి అదే సంస్థ‌తో ముందుకెళ్తున్నారు. `జైభీమ్` విజ‌యంతో టి.జె జ్ఞాన్ వేల్ పేరు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయినా ఆసినిమాకి మంచి స‌క్సెస్ అయింది. దీంతో `వెట్టేయాన్` పై పాన్ ఇండియాలో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఇందులో ర‌జ‌నీతో పాటు అమితాబ‌చ్చ‌న్, ఫ‌హాద్ పాజిల్, రానా ద‌గ్గుబాటి లాంటి స్టార్ హీరోలు కూడా భాగ‌మ‌వ్వ‌డం విశేషం.