Begin typing your search above and press return to search.

500 మందితో 5 కోట్ల‌తో అంత ర‌చ్చ‌!

ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాలో ఓ భారీ సాంగ్ షూట్ కూడా పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. 500 మంది డాన్స‌ర్ల తో ఈ పాట చిత్రీక‌రించారు. ఈ పాట కోస‌మే 5 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసారుట‌.

By:  Tupaki Desk   |   25 July 2024 5:40 AM GMT
500 మందితో 5 కోట్ల‌తో అంత ర‌చ్చ‌!
X

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడిగా టి.జే .జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌క‌త్వంలో 'వెట్టేయాన్' భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 'జైభీమ్' లాంటి సందేశాత్మ‌క చిత్రం త‌ర్వాత జ్ఞాన్ వేల్ సూప‌ర్ స్టార్ ని డైరెక్ట్ చేయ‌డంతో ఇందులో ర‌జ‌నీ రోల్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ విజ‌యం చూసే ర‌జ‌నీకాంత్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. అందుకు త‌గ్గ‌ట్టే జ్ఞాన్వేల్ ప‌నిచేస్తున్న‌ట్లు సోర్సెస్ చెబుతున్నాయి.

సూప‌ర్ స్టార్ కెరీర్ లో మ‌రో గొప్ప సినిమా గా నిల‌వ‌బోతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్, తిరువ‌నంత‌పురం, క‌న్యాకుమారి, ముంబై, కేర‌ళ ప్రాంతాల్లో టాకీ పార్టు పూర్తిచేసారు ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాలో ఓ భారీ సాంగ్ షూట్ కూడా పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. 500 మంది డాన్స‌ర్ల తో ఈ పాట చిత్రీక‌రించారు. ఈ పాట కోస‌మే 5 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసారుట‌. సినిమాలో ఈ పాట ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇంత భారీతారాగ‌ణం మ‌ధ్య ర‌జ‌నీకాంత్ పై పాట‌ల చిత్రీక‌ర‌ణ కొత్తేం కాదు కాదు. గ‌తంలో చాలా సినిమాల్లో 1000 మంది డాన్స‌ర్ల ఆద్వ‌ర్యంలోనూ ర‌జ‌నీ కి డాన్సులు చేసిన అనుభ‌వం ఉంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఇంత మంది డాన్స‌ర్ల‌తో ప‌నిచేయ‌లేదు. ఆ ర‌కంగా ఇది భారీ కాన్వాస్ పై చిత్రీక‌రించిన పాట‌గా చెప్పొచ్చు. అయితే ఈ పాట‌కు ఎవ‌రు కొరియోగ్ర‌ఫీ చేసారు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్షన్స్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పొస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి దీపావ‌ళి కానుక‌గా ఆక్టోబ‌ర్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ర‌జ‌నీకాంత్ హీరోగా లొకేష్ క‌న‌గరాజ్ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. వెట్టేయాన్ ముగింపు దశ‌కు చేరుకున్న స‌మ‌యంలోనే లొకేష్ కూలి సినిమాకి డేట్లు కేటాయించారు.