Begin typing your search above and press return to search.

రామారావు బ్యూటీ కి కెమెరామెన్ తోపెళ్లి!

అవును ర‌జీషా త్వ‌ర‌లో పెళ్లికుమార్తె కాబోతుంది. ప్రేమించిన టోపిన్ థామ‌స్ ని వివాహం చేసుకోబోతుంద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 6:29 AM GMT
రామారావు బ్యూటీ కి కెమెరామెన్ తోపెళ్లి!
X

'రామారావు ఆన్ డ్యూటీ'తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ర‌జీషా విజ‌య‌న్ సుప‌రిచితమే. మాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అమ్మ‌డికి రామారావు తొలి తెలుగు సినిమా. ఈ సినిమా విజ‌యంతో ఇండ‌స్ట్రీలో పాగా వేయాల‌నుకుంది. కానీ వైఫ‌ల్యం ఆమెని వెన‌క్కి నెట్టింది. ఆ సినిమా త‌ర్వాత ఇక్క‌డ ఛాన్సులు రాలేదు. దీంతో సొంత భాష‌కే ప‌రిమిత‌మైంది. అయితే అక్క‌డా కొత్త ఏడాదిలో ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమాకి సైన్ చేసింది లేదు. దీంతో అమ్మ‌డు పెళ్లి చేసుకోవాల‌నుకుందే! ఏమో ఒక్క‌సారిగా ఆ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అవును ర‌జీషా త్వ‌ర‌లో పెళ్లికుమార్తె కాబోతుంది. ప్రేమించిన టోపిన్ థామ‌స్ ని వివాహం చేసుకోబోతుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో వీళ్లిద్ద‌రు 'ఖోఖో', 'ల‌వ్లీ యువ‌ర్స్' సినిమాల‌కు ప‌నిచేసారు. ఆ స‌మ‌యంలో ప్రేమ‌లో పడ్డారు. అప్ప‌టి నుంచి ప్రేమ పావురాల్లా ఎగురుతున్నారు. దీంతో ప్రేమ‌కి పుల్ స్టాప్ పెట్టి వివాహ బంధంతో ఒక‌టి కావ‌డానికి రెడీ అవుతున్నారు. కానీ దీనిక సంబంధించి అధికారిక స‌మాచారం వెలువ‌డాల్సి ఉంది.

ర‌జీషా 2016 లో మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై గ్యాప్ లేకుండా సొంత భాష‌లో సినిమాలు చేసింది. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డి ట్యాలెంట్ ని గుర్తించి రామారావు ద‌ర్శ‌కుడు ఛాన్స్ ఇచ్చాడు. కానీ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో అమ్మ‌డి ట్యాలెంట్ కిల్ అయిన‌ట్లు అయింది. అప్ప‌టి నుంచి కొత్త అవ‌కాశాలు రాలేదు. మ‌రి వివాహం త‌ర్వాత సెకెండ్ ఇన్సింగ్స్ ఎలా ప్లాన్ చేస్తుంది? అన్న‌ది చూడాలి. అయితే వివాహం అయిన హీరోయిన్ల‌కు ఈ మ‌ధ్య సౌత్ లో మంచి డిమాండ్ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

పెళ్లికాని వారికంటే చేసుకుని..పిల్ల‌ల్ని క‌న్న‌వారికి ఎక్కువ‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ కోటాలో వాళ్లే ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా క‌నిపిస్తున్నారు. మ‌రి ర‌జీషా వివాహం వెనుక అలాంటి స్ట్రాట‌జీ ఏదైనా ఉందా? అన్న‌ది తెలియాలి. అయినా వివాహం జీవితంలో భాగం కాబ‌ట్టి త‌ప్ప‌ని తంతు అది.