Begin typing your search above and press return to search.

సంజయ్ దత్ ఇమేజ్‌ను నాశ‌నం చేసారు! ఆరోప‌ణ‌ల‌కు హిరాణీ జ‌వాబు!!

రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సంజు(2018)లో రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రను పోషించారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 12:30 AM GMT
సంజయ్ దత్ ఇమేజ్‌ను నాశ‌నం చేసారు! ఆరోప‌ణ‌ల‌కు హిరాణీ జ‌వాబు!!
X

రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సంజు(2018)లో రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రను పోషించారు. ఈ బ‌యోపిక్ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు పైగా వసూలు చేయడం ఒక సంచ‌ల‌నం. ద‌త్ లైఫ్‌ డ్రామా బాలీవుడ్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. సంజు చిత్రం ప్రేక్షకులు , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు పొందినా కానీ, దత్ ఇమేజ్‌ను ద‌ర్శ‌కుడు నాశ‌నం చేసాడ‌ని చాలా మంది ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ ఆరోపణలను ఖండించారు. అతడు సంజూ సినిమాను ఎందుకు తీశాడో అసలు కారణాన్ని వెల్లడించారు. అత‌డి ఇమేజ్ ను నాశ‌నం చేయ‌డం కోసం సినిమా తీయ‌లేదని, అలాగే అత‌డి జీవితంలో క‌ఠోర నిజాల్ని కూడా దాచేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

తన యూట్యూబ్ ఛానల్ `గేమ్ ఛేంజర్స్`లో ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ‌తాతో హిరాణీ మాట్లాడుతూ.. సంజయ్ దత్ ఇమేజ్ ని వైట్ వాష్ చేయమని బలవంతం చేశారా? అని నన్ను అడిగారు. మీకు అతనితో ఏ సమస్య ఉందా? అని నేను అడిగాను. అతడు ``సంజ‌య్ తుపాకీని తన దగ్గరే ఉంచుకున్నాడు`` అని అన్నాడు.. అని హిరాణీ గుర్తు చేసుకున్నారు. కాబట్టి మేం అతడు తుపాకీని త‌నతో ఉంచుకున్నట్లు తెర‌పై చూపించాము. అతడు తన స్నేహితుడితో దానిని నీటిలోకి విసిరేసి నాశనం చేయమని అడిగిన‌ట్టు చూపించాం. అతడు డ్రగ్స్ బానిస అని కూడా చూపించాము. అతడు తన బెస్ట్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో పడుకున్నట్లు కూడా చూపించాము. అతడు ఒక పిచ్చివాడని కూడా చూపించాము. నేను అతని ఇమేజ్ ని వైట్ వాష్ చేయడానికి ఏమి చూపించలేదు. ప్రజలు అత‌డి గురించి చదివిన దాని ఆధారంగా ఒక అవగాహనను పెంచుకున్నారు. ఎవరూ అతడిని ప్రత్యక్షంగా తెలుసుకోరు... అని కూడా త‌న సినిమాని స‌మ‌ర్థించుకున్నారు. నేను ఒకరి ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు సినిమా తీయాల‌ని అంతగా తహతహలాడే డైరెక్టర్‌ని కాదని హిరాణీ అన్నారు. అతడికి అంత సన్నిహితుడిని కూడా కాదు. కథ విష‌యంలో నాకు అత్యాశ ఉంది. కథను అతడు వైపు విన్నట్లు కాదు.. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. నేను ఒక పోలీసుతో కూడా మాట్లాడాను. ``మీరు తుపాకీ ఉంచుకున్నారని చెప్పండి.. దాని గురించి అందరికీ తెలుసు.. అని అన్నారు. ఈ విష‌యాల‌న్నీ సంజ‌య్ ద‌త్ కి తెలుసని మీరు అనుకుంటున్నారా? ఇదే జరిగితే నేను సినిమా తీయను. తుపాకీని త‌న‌తో ఉంచుకున్న‌ తెలివితక్కువవాడు అని సంజూ గురించి అన్నాడు.

హిరాణీ ఇంకా మాట్లాడుతూ.. అత‌డి ఇంట్లో RDX నిండిన ట్రక్కు ఉందని ఒక అభిప్రాయం ఉంది. ఇది కూడా ఒక వార్త కార‌ణంగా ప్ర‌చార‌మైంది. పరిశ్రమలో చాలా మంది ఈ చిత్రం గురించి వ్యతిరేకంగా నాతో మాట్లాడారు. నువ్వు ఇలా ఎందుకు తీసావు? ఇందులో నిజం లేదు. అతని వద్ద అలాంటి ట్రక్కు ఉన్నట్లు ఎటువంటి రికార్డు లేదు. నేను మొత్తం హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పును చదివాను. ఏమీ ప్రస్తావించలేదు. సంజయ్ కూడా తనపై ఎప్పుడూ అలాంటి ఆరోపణలు లేవని చెప్పాడు.. అని కూడా అన్నారు. కానీ ఆ సీన్ ఆసక్తికరంగా ఉండటంతో నేనే అలా చేశాను.. అని హిరాణీ అన్నారు.

రణ్‌బీర్ సంజు పాత్ర‌లో న‌టించ‌గా, ఇందులో పరేష్ రావల్, విక్కీ కౌశల్, మనీషా కొయిరాలా, అనుష్క శర్మ, జిమ్ సర్భ్, దియా మీర్జా తదితరులు నటించారు. సంజయ్ దత్ బయోపిక్‌ను రూపొందించే ముందు రాజ్‌కుమార్ హిరాణీ మున్నా భాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నా భాయ్‌లకు దర్శకత్వం వహించారు. 2014లో హిరాణీ ఆమిర్ ఖాన్‌తో కలిసి చేసిన PKలో దత్ ప్రత్యేక పాత్రలో కూడా కనిపించాడు.