Begin typing your search above and press return to search.

లేడీ గెటప్‌ లో రూ.500 కోట్ల మూవీ హీరో!

సాధారణంగా స్టార్‌ హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలు లేడీ గెటప్‌ అంటే మొహమాట పడతారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 11:55 AM GMT
లేడీ గెటప్‌ లో రూ.500 కోట్ల మూవీ హీరో!
X

సాధారణంగా స్టార్‌ హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలు లేడీ గెటప్‌ అంటే మొహమాట పడతారు. చాలా అరుదుగా మాత్రమే మన ఇండియన్ హీరోలు లేడీ గెటప్ ల్లో కనిపించారు. అప్పట్లో కమల్‌ హాసన్ లేడీ గెటప్ వేస్తే అంతా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టి మరీ చూసేవారు. ఆ తర్వాత కొందరు సౌత్‌ హీరోలు, కొందరు బాలీవుడ్‌ హీరోలు లేడీ గెటప్ లో కనిపించారు. ప్రేక్షకులు వైవిధ్యం ను కోరుకుంటున్నారు కనుక హీరోలు లేడీ గెటప్స్ లో కనిపించి అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మరో హీరో కూడా లేడీ గెటప్ తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాడు.

ఈ హిందీ హీరోను మీరు గుర్తు పట్టారా... హీరోయిన్స్ కూడా ఈయన లేడీ గెటప్‌ అందం ముందు దిగదుడుపే అన్నట్లు ఉన్నాడు కదా... ఈయన మరెవ్వరో కాదు రాజ్‌ కుమార్‌. ఇటీవల ఈయన నటించిన స్త్రీ 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్ల వసూళ్లు నమోదు చేస్తే గొప్ప విషయం అన్నట్టు ప్రస్తుతం బాలీవుడ్‌ లో పరిస్థితి ఉంది. ఎంతటి భారీ బడ్జెట్‌ సినిమాలకైనా దిక్కు మొక్కు లేకుండా ఉంది. చిన్న సినిమాలను అసలు థియేటర్‌ లో చూసే వారే లేరు. అలాంటి సమయంలో వచ్చిన రాజ్ కుమార్‌, శ్రద్దా కపూర్‌ ల స్త్రీ 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

విడుదల అయ్యి మూడు వారాలు కావస్తున్నా ఇప్పటికీ వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం స్త్రీ 2 సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈ మధ్య కాలంలో ఒక ఇండియన్ సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం రేర్‌ గా జరిగింది. బాహుబలి 1 తో పాటు పలు సినిమాల రికార్డ్‌ లను బ్రేక్ చేసిన స్త్రీ 2 సినిమాలో హీరోగా నటించిన రాజ్ కుమార్‌ ఇలా లేడీ గెటప్‌ లో కనిపించడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్‌ ఇదేం మాస్ మావ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

స్త్రీ 2 చాలా సన్నివేశాలను ఎడిటింగ్‌ సమయంలో తొలగించారు. డిలీట్ అయిన కొన్ని సన్నివేశాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో చిత్ర యూనిట్‌ సభ్యులు షేర్‌ చేస్తున్నారు. అలా షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో స్త్రీ 2 సినిమాకు ఇంకాస్త బజ్‌ క్రియేట్‌ అవ్వడంతో పాటు వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. తాజాగా రాజ్ కుమార్‌ షేర్ చేసిన ఈ లేడీ గెటప్ తో స్త్రీ 2 గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ఆ సినిమా లో ఏముందో అనే విషయాన్ని తెలుసుకునేందుకు చాలా మంది థియేటర్‌ ల బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి స్త్రీ 2 జోరు ఇంకా ఎన్నాళ్లు కంటిన్యూ అయ్యేనో చూడాలి.