Begin typing your search above and press return to search.

2000 కోట్ల వ‌సూళ్ల‌లో ఆ ఒక్క‌డి రికార్డ్!

అత‌డు అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడు. ద‌శాబ్ధాల కెరీర్ లో ఫెయిల్యూర్ అన్నదే లేదు. పైగా రికార్డ్ బ్రేకింగ్ హిట్ల‌ను తెర‌కెక్కంచాడు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:13 AM GMT
2000 కోట్ల వ‌సూళ్ల‌లో ఆ ఒక్క‌డి రికార్డ్!
X

అత‌డు అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడు. ద‌శాబ్ధాల కెరీర్ లో ఫెయిల్యూర్ అన్నదే లేదు. పైగా రికార్డ్ బ్రేకింగ్ హిట్ల‌ను తెర‌కెక్కంచాడు. తీసిన సినిమాల‌న్నీ బంప‌ర్ హిట్లే. భార‌త‌దేశంలోనే టాప్ 5 డైరెక్ట‌ర్స్ జాబితాలో అత‌డి పేరు త‌ప్ప‌నిస‌రిగా వినిపిస్తుంది. 100శాతం సక్సెస్ రేటు సాధించిన ఏకైక బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ గురించే ఇదంతా.

సోమవారం 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాజ్‌కుమార్ హిరాణీ తన కెరీర్‌లో సాధించ‌ని ఘ‌న‌త లేదు. దర్శక-నిర్మాత రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నారు. అవన్నీ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. స‌క్సెస్ లు మాత్ర‌మే కాదు.. అతడి చిత్రాలన్నీ విమర్శకుల ప్రశంస‌లు ద‌క్కించుకున్నాయి. అత‌డి సినిమాలు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నాయి. ఇది ఏ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత సాధించ‌లేని ఘ‌న‌త‌.

హిరాణీ 2003లో మున్నాభాయ్ MBBSతో చిత్ర నిర్మాణ వృత్తిని ప్రారంభించాడు. ఈ సినిమా క‌థ‌ను మొదట షారుఖ్ ఖాన్ కోసం రాసుకున్నాడు. కానీ ఖాన్ ఈ పాత్రను అంగీకరించలేదు. బదులుగా, టైటిల్ రోల్ సంజయ్ దత్‌కి ద‌క్కింది. అప్ప‌టికి ద‌త్ తన కెరీర్ స‌హా వ్యక్తిగత జీవితంలోని క్ష‌ణ ద‌శ నుంచి బ‌య‌ట‌ప‌డి తిరిగి ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 126 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా సీక్వెల్ - లగే రహో మున్నాభాయ్ ఇంకా పెద్ద విజ‌యం సాధించింది. అప్పటి నుండి, హిరాణీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. 2009లో 3 ఇడియట్స్ రూ.400 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఐదేళ్ల తర్వాత రూ.770 కోట్లు రాబట్టిన పీకేతో హిరాణీ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. 2018లో, అతడు రణబీర్ కపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అయిన `సంజూ`కి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 586 కోట్లు రాబట్టింది. అన్నీ కలిపితే హిరానీ సినిమాలు రూ. 2000 కోట్లలోపు వసూళ్లు సాధించాయి.

ఇప్పుడు మున్నాభాయ్ MBBS రిలీజైన‌ 20 సంవత్సరాల తర్వాత, హిరాణీ చివరకు షారుఖ్ ఖాన్‌తో కలిసి ప‌ని చేసాడు. ఈ జోడీ నుంచి డంకీ విడుద‌ల‌వుతోంది. హిరాణీతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఇద్దరూ కలిసి పనిచేసే స్క్రిప్ట్‌ను అడిగార‌ని షారూఖ్ పేరు వినిపించింది. డంకీ చిత్రం క‌థాంశం ఆస‌క్తిక‌రం. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ సమస్యతో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.