Begin typing your search above and press return to search.

అందంగా క‌నిపిచ‌డం కోసం ముఖంలో పిల్ల‌ర్లా?

అందంగా క‌నిపించ‌డం కోసం సెల‌బ్రిటీలు ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు వెళ్తారన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 April 2024 6:01 AM GMT
అందంగా క‌నిపిచ‌డం కోసం ముఖంలో  పిల్ల‌ర్లా?
X

అందంగా క‌నిపించ‌డం కోసం సెల‌బ్రిటీలు ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు వెళ్తారన్న సంగ‌తి తెలిసిందే. ముక్కు స‌ర్జ‌రీ..మూతి స‌ర్జ‌రీ...ముఖం స‌ర్జ‌రీ...పెదాల స‌ర్జ‌రీ అంటూ వాళ్ల‌కు ఏ భాగ‌మైతే న‌చ్చ‌దో దాన్ని స‌ర్జ‌రీ ద్వారా స‌రి చేసుకుని అందంగా ఉండాల‌ని ట్రై చేస్తుంటారు. స‌ర్జ‌రీలు విక‌టించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అది వేరే సంగ‌తి అనుకోండి. తాజాగా బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు ముఖంలోకొన్ని ర‌కాల మార్పులొచ్చే స‌రికి ఇత‌డు కూడా ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్నాడా? అనే వార్త బాలీవుడ్ లో మీడియాలో ఒక్క‌సారిగా వైర‌ల్ గా మారింది.

సాధార‌ణంగా స‌ర్జ‌రీలు అంటే ఎక్కువ‌గా హీరోయిన్ల పేర్లు వినిపిస్తుంటాయి. హీరోలు చాలా రేర్ గా స‌ర్జ‌రీల‌కు వెళ్తుంటారు. కాబ‌ట్టి రాజ్ కుమార్ రావ్ ఆ ఛాన్స‌న్ ఎందుకు తీసుకుంటాడ‌ని ఖండిచ‌న వ‌ర్గం కూడా ఉంది. ఓ సినిమా ప్ర‌మోష‌న్ లో అత‌డి పేస్ కొత్త‌గా క‌నిపించడంతా? అంతా అత‌డా? అత‌ను బ్ర‌ద‌ర్ ? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతోనే స‌ర్జీరీ మ్యాట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. దీనిపై ఎవ‌రికి వారు చ‌ర్చించుకోవ‌డం త‌ప్ప‌! రాజ్ కుమార్ రావ్ ని అడిగే ప్ర‌య‌త్నం చేయలేదు.

అయితే ఓ ఇంట‌ర్వ్యూలో నేరుగా రాజ్ కుమార్ రావ్ ముందుకు ఈ విష‌యం వెళ్లింది. దీంతో ఆయ‌న వెంట‌నే అన్ని సందేహాల్ని తీర్చేసారు. తాను ఎలాంటి స‌ర్జ‌రీలు చేయించుకోలేద‌ని కొట్టిపారేసాడు. కానీ ముఖం కాంతివంతంగా క‌నిపించడం కోసం చ‌ర్మం కింద పిల్ల‌ర్స్ వాడినిట్లు తెలిపారు. ఫిల్లర్లు వాడితో చర్మం ప్ర‌కాశ‌వంతంగా మెర‌స్తుంది. ఒక‌ర‌క‌మైన షైనింగ్ ఉంటుంది. అలాగే చ‌ర్మం ఎంతో నునుపుగానూ మారుతుంది. ఎలాంటి మ‌చ్చ‌లు కూడా క‌నిపించ‌వు.

ఇదొక కృత్రిమ ప‌ద్ద‌తి. కొన్ని రోజుల పాటే ఇలా ఉంటుంది. త‌ర్వాత దానంత‌టే అదే త‌న గుణాన్ని కోల్పోతుంది. అటుపై చ‌ర్మం పాత రంగులోకి మారుతుంది. ప్ర‌స్తుతం రాజ్ కుమార్ రావు తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్ల జీవిత క‌థ‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.