Begin typing your search above and press return to search.

ఇంటి ఈఎమ్ఐ క‌డుతోన్న స్టార్ హీరో!

సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఖ‌రీదైన జీవితం. చుట్టూ రంగుల మ‌యం.

By:  Tupaki Desk   |   15 Oct 2024 1:30 PM GMT
ఇంటి ఈఎమ్ఐ క‌డుతోన్న స్టార్ హీరో!
X

సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఖ‌రీదైన జీవితం. చుట్టూ రంగుల మ‌యం. ఖరీదైన బంగ్లా, కోట్ల ఖ‌రీదు చేసే కార్లు.. బంగారు ఆభ‌ర‌ణాలు. ఇవి గాక కూడ‌బెట్టిన ఆస్తులు.. అడ్వాన్సులు అందుకుంటే? వాటిని ఇత‌ర వ్యాపారాల్లో పెట్ట‌డం...ఇలా ఒక‌టేంటి సెల‌బ్రిటీ అంటే కోటీశ్వ‌రుడు. వాళ్ల‌కు డ‌బ్బుకు కొద‌వేముంటుంది. ఎద‌గ‌నంత వ‌ర‌కే. ఎదిగిన త‌ర్వాత వ‌ద్దన్నా డ‌బ్బు అలా వ‌చ్చి ప‌డిపోతుంది.

డ‌బ్బు అంటే ముఖం మోత్తేసిది వాళ్ల‌కే అని అంటారు. కానీ నా ప‌రిస్థితి వేరు అంటూ బాలీవుడ్ స్టార్ న‌టుడు రాజ్ కుమార్ రావ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసారు. ఓ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా కార్ కొనుగోలు, రెమ్యున రేషన్స్ గురించి ప్రస్తావన రాగా ఆయ‌న ఇలా స్పందించారు. `నా దగ్గర అంత డబ్బు లేదు. జనాలు నా దగ్గర ఓ వంద కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ నేను ఇంకా నా ఇంటి ఈఎమ్ క‌డుతూనే ఉన్నాన‌ని ఎంత‌మందికి తెలుసు?

షోరూమ్ కి వెళ్లి 6 కోట్ల కార్ కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేను. 50 లక్షల రూపాయల కార్ కూడా కొనలేను. ఓ 20 లక్షల కార్ అయితే మ్యానేజ్ చేయ‌గ‌ల‌ను. చాలామంది న‌టుల‌కు ఓవర్ నైట్ లో డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ అది ఇక్క‌డ ప‌రిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్క‌డ జీవితం అంతా అనుకున్నంత తేలిక కాదు` అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గామారాయి.

ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తెలుగు న‌టుడు చ‌లాకీ చంటి కూడా ఇలాగే మాట్లాడాడు. ఇండ‌స్ట్రీలో ఉంటే డ‌బ్బులంటాయ‌నుకుంటారు. కానీ ఇక్క‌డ సంపాదించిన డ‌బ్బు అందుకు త‌గ్గ‌ట్టు మెయింటెన్ చేయ‌డానికి ఖ‌ర్చు అయిపోతుంద‌న్నాడు. అలా చేయ‌క‌పోతే చూసే వాళ్లు కూడా చూడ‌ర‌ని వ్యాఖ్యానించారు.