చిలిపి కన్నయ్య.. భార్య నిదురించాక మరదలితో నైట్ పార్టీ
రాజ్ కుంద్రా పాత వీడియో ఒకటి అంతర్జాలంలో సెన్సేషన్ గా మారింది
By: Tupaki Desk | 29 July 2023 4:01 AM GMTశిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను నిర్మించాడన్న ఆరోపణలపై గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రజల నుంచి కుంద్రా-శిల్పాశెట్టి దంపతులు ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజ్ కుంద్రా ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉన్నాడు. ఆరుబయటకు వస్తే ప్రతిచోటా ముసుగులు ధరించి కనిపించాడు. కుంద్రా ప్రస్తుతం బెయిల్ పై బయట పడినా పాత కేసుల విచారణకు అటెండవుతున్నారు. బోంబేడైయింగ్ రాజ్ కుంద్రాగా అతడు చాలా కాలంగా సంఘంలో ఎంతో పాపులర్. కానీ తప్పుడు విధానాల్లో డబ్బు సంపాదన అతడిని రచ్చకీడ్చిందని కథనాలొచ్చాయి. ఇక భర్త కుంద్రా అరెస్టు అయినా శిల్పాశెట్టి అతడికి మద్ధతుగా నిలిచింది.
గత కొంతకాలంగా శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతులు స్థబ్ధుగా ఉన్నారు. ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు. ఇలాంటి సమయంలో రాజ్ కుంద్రా పాత వీడియో ఒకటి అంతర్జాలంలో సెన్సేషన్ గా మారింది. ఈ వీడియోలో కుంద్రా చేసిన వ్యాఖ్యలు యువతరంలో తీవ్రమైన ట్రోలింగుకి కారణమయ్యాయి. ఇంతకీ రాజ్ కుంద్రా ఏమన్నారు? అంటే...అతడు తన భార్య శిల్పా శెట్టి నిద్రపోయిన తర్వాత తన మరదలు షమితా శెట్టితో నైట్ పార్టీలకు వెళ్లేవాడినని తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇది కపిల్ శర్మ షోలో చాటింగ్ కు సంబంధించిన వీడియో. 2016లో ప్రీమియర్ అయింది. అతని భార్య శిల్పా శెట్టి -మరదలు షమితా శెట్టితో కలిసి రాజ్ కుంద్రా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో రాజ్ కుంద్రా మాట్లాడుతూ శిల్పాశెట్టిని పెళ్లి చేసుకోవడం వల్ల తాను లాభపడ్డానని పేర్కొన్నాడు. శిల్పా సాయంత్రం తొమ్మిది గంటలకు పడుకునేదని బయటకు వెళ్లి పార్టీ చేసుకోవాలనుకుంటే తన మరదలు షమితా శెట్టి నిపిలిచేవాడినని పేర్కొన్నాడు.
భార్య శిల్పాశెట్టి చాలా హోమ్లీ గాళ్. ఆమె రాత్రికి బయటికి వెళ్లకుండా 9:00 గంటల తర్వాత పడుకునేది. అందుకే అప్పుడప్పుడు పార్టీ చేసుకోవాలనుకున్నప్పుడు తన మరదలికి ఫోన్ చేసి అడిగేవాడట. దానికి షమిత ఎప్పుడూ నిరాకరించలేదు. బయటికి వెళ్లాల్సి వస్తే మరదలు షమిత గుర్తుకు వస్తుందని ఇంట్లో ఉండి పుస్తకాలు చదవాల్సి వస్తే భార్య శిల్ప గుర్తుకు వస్తుందని రాజ్ కుంద్రా అన్నారు. అక్కాచెల్లెళ్ల నడుమ అతడు బహుళ ప్రయోజనాన్ని అనుభవించానని అంగీకరించాడు. అందుకే అతను నిజంగా మరదలిని (షమిత) త్వరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయలేదట. ఎంత ఆలస్యంగా షమిత పెళ్లి అయితే అంత మంచిదని కూడా అనుకున్నాడట.
అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్లు అదే రేంజులో పడుతున్నాయ్. మరదలు షమితా శెట్టితో కలిసి పార్టీ చేసుకున్నందుకు రాజ్ కుంద్రాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నెటిజనులు ప్రస్తుతం రాజ్ కుంద్రాని ఎగతాళి చేస్తున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ-''అందుకే ఈ రోజు ముసుగు ధరించి మీ ముఖాన్ని బహిర్గతం చేయలేక ప్రతిచోటా నడవాల్సి వచ్చింది'' అని అన్నారు. ''ఈ ఎపిసోడ్ తర్వాత, అతను ఇకపై తన ముఖం చూపించలేడు.. ముసుగు ధరించి చుట్టూ తిరుగుతున్నాడు'' అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో క్రికెట్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సహ-యజమానిగా ఉన్న శిల్పాశెట్టి ఫిబ్రవరి 2009లో రాజ్ కుంద్రాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 22 నవంబర్ 2009న వీరి వివాహం జరిగింది. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శిల్పాశెట్టి బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా ఇప్పుడు భారీగానే ఆర్జిస్తోంది.