నాపై ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి: రాజ్ కుంద్రా
అయితే అతడిని గతం నీడలా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. అతడు ప్రతి వేదికపైనా ఆ ఒక్క ప్రశ్నకు జవాబును వెతకాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 28 Oct 2023 1:32 PM GMTవ్యాపారవేత్త, సినీనిర్మాత రాజ్ కుంద్రా వైఖరి ప్రతిసారీ వివాదాస్పదం అవుతోంది. తాజాగా అతడు చేసిన ఒక వ్యాఖ్య నెటిజనుల్లో వాడి వేడి చర్చకు తెర తీసింది. కుంద్రాజీ ప్రస్తుతం నటుడిగా మారుతున్నాడు. అతడు UT - 69 అనే చిత్రంతో తన నటనా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవల తన తొలి చిత్రం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అయితే అతడిని గతం నీడలా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. అతడు ప్రతి వేదికపైనా ఆ ఒక్క ప్రశ్నకు జవాబును వెతకాల్సి వస్తోంది. ఇప్పుడు అలాంటి ప్రశ్ననే అతడు మరోసారి ఎదుర్కొన్నాడు.
2022లో అశ్లీల యాప్ ల రూపకర్తగా పోలీసులకు పట్టుబడ్డ రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత జైలులో గడిపిన సంగతి తెలిసిందే. ఇదే ఇతివృత్తంతో కుంద్రా డెబ్యూ చిత్రం రూపొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి ఇంటర్వ్యూలో 'పోర్న్ కింగ్' అని తనను పిలుస్తున్న నెటిజనుల గురించి స్పందిస్తూ.. అలాంటి వ్యాఖ్యలను చదివినప్పుడు అది 'బాధకలిగిస్తుంది' అని ఒప్పుకున్నాడు. అతడు తన వ్యధ గురించి మాట్లాడుతూ ఇలాంటివి బాధ కలిగించవని చెబితే అబద్ధం చెబుతున్నామని అర్థం. కానీ కరణ్ జోహార్ ట్రోలర్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చెబుతున్న ఇంటర్వ్యూను చూశాను. నేను అక్షరాలా అదే విధంగా చేస్తున్నాను. నేను ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా అదే చీజ్ (విషయం) పునరావృతం అవుతుంటే జవాబిస్తూనే ఉన్నాను. ప్రతి సోషల్ మీడియాలో 'మాస్క్ మ్యాన్'తో నా పోస్ట్ బయటకు వెళ్లినప్పుడల్లా అది కట్ పేస్ట్ కాపీ మాత్రమే అవుతుంది'' అని రాజ్ కుంద్రా అన్నారు.
ఒక సోషల్ మీడియా యూజర్ తన సినిమాని 'బహిష్కరించాలని' పిలుపునిచ్చిన తర్వాత తన డెబ్యూ చిత్రం చుట్టూ ఉన్న వివాదాలపైనా, మీడియా నుండి ద్వేషాన్ని ఎదుర్కోవడంపైనా కూడా స్పందించారు. ''ఈ వ్యక్తి స్త్రీల గౌరవాన్ని కించపరిచే విధంగా సినిమా తీస్తున్నాడు.. అతడి సినిమాను నిషేధించాలి. ఈ సినిమాను బహిష్కరించండి'' అని ట్వీట్ చేసారు. దీనికి రాజ్ వెంటనే బదులిచ్చారు. ''దయచేసి మీ క్లెయిమ్‌లకు మద్దతు ఇవ్వగల ఒక మహిళ పేరు చెప్పండి.
రాళ్లు విసరడం సులభం కానీ సాక్ష్యాధారాలతో జరిగిన దానిని చూపగలరా? నా ప్రియమైన ప్రజలారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రజల్లోని ఈ ద్వేషం కేవలం మీడియా సృష్టించినది. #సత్యం జయతే #UT69'' అని సోషల్ మీడియాల్లో రాసారు కుంద్రా.
UT 69 ట్రైలర్ లాంచ్‌లో రాజ్ తనపై సినిమా తీయాలనే కోరికను మొదటిసారి వ్యక్తం చేసినప్పుడ తన భార్య శిల్పాశెట్టి ఎలా స్పందించిందో కూడా చెప్పారు. ''నేను సినిమా చేస్తున్నానని ఆమెకు చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు కొన్ని అడుగుల దూరంలో ఉంది.
నేను ఆమె దగ్గరికి వెళ్లాలని అనుకోలేదు'' అని తెలిపాడు. UT 69 చిత్రం నవంబర్ 3న పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ కుంద్రా రకరకాల పరీక్షలను ఎదుర్కొంటున్నారు. అతడి గతం అతడిని నీడలా వెన్నాడుతోందని తన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.