శిల్పాశెట్టితో రాజ్ కుంద్రా విడాకులా
దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి అని ట్విటర్లో రాసుకు రావడం బాలీవుడ్ సమా అంతటా హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 20 Oct 2023 6:50 AM GMTశిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి అని ట్విటర్లో రాసుకు రావడం బాలీవుడ్ సమా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈరకమైన రాతతో పాటు గుండె ముక్కలైన ఎమోజీని జోడించాడు. సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ట్వీట్ చేసి సంచలనం రేపాడు.
దీంతో నెటి జనులు షాక్ అయ్యారు. సడెన్ గా ఇలాంటి ట్విట్ పెట్టాడేంటి? అని అంతా ఆశ్చర్యపో తున్నారు. శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా విడిపోతున్నారా? అన్న వార్త మీడియా అంతటా దావానా లా వ్యాపించింది. ఇద్దరు సఖ్యంగానే ఉన్నారుగా? కొత్తగా కలతలేవైనా చోటు చేసుకోవడంతో ఈ రకమైన నిర్ణయం ఏదైనా తీసుకు న్నారా? అంటూ ఫిలిం సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
అయితే ఈ ట్వీట్ వెనుక బాధకరమైన ఉద్దేశం ఏంటి? అన్నది క్లారిటీ లేదు. ఎక్కడా శిల్పా శెట్టితో విడిపోతున్నట్లు గానీ.. గొడవపడినట్లు గానీ చెప్పలేదు. మరి నిజంగా రాజ్ కుంద్రా విడిపోయేది శిల్పతో నా? ఇంకేదైనా విషయంలోనా? అన్నది క్లారిటీ రావాలి. అయితే రాజ్ కుంద్రా కొన్ని నెలలుగా ముఖానికి మాస్క్ వేసుకుని బయట తిరుగుతోన్న సంగతి తెలిసిందే. గుమ్మం దాటి బయటకు రావాలంటే ముఖానికి మాస్క్ ఉండాల్సిందే.
ముంబై వీధుల్లో అలా మాస్క్ వేసుకుని కనిపించిన వ్యక్తి ఒకే ఒక్కడు రాజ్ కుంద్రా. నీలి చిత్రాల కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన దగ్గర నుంచి కుంద్రా అలాగే తిరుగుతున్నా డు. ఈనేపథ్యం తో కుంద్ర విడిపోయేది మాస్క్ తోనా? ఆ కారణంగానే అలాంటి ట్వీట్ చేసాడా? లేక శిల్పాశెట్టితో నిజంగానే కటీఫ్ అవుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం రాజ్ కుంద్రా తన జీవితాన్ని 'యూటీ 69' టైటిల్ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రచారంలో భాగంగా స్టేజ్ పై ఒకే ఒక్కసారి ఆ మాస్క్ తొలగిం చి జనాలకి కనిపించాడు. మళ్లీ ఇంతవరకూ అలాంటి ఛాన్స్ తీసుకోలేదు.