Begin typing your search above and press return to search.

ఒక్క ప్ర‌శ్న అంటూ ప్రాజెక్ట్ K పై డౌట్ పెట్టేసిన రాజ‌మౌళి

అబ్బాయిలు మీరు దీన్ని సాధ్యం చేసారు.. డార్లింగ్ స్మాషింగ్ (sic) అని రాజమౌళి ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 July 2023 4:52 PM GMT
ఒక్క ప్ర‌శ్న అంటూ ప్రాజెక్ట్ K పై డౌట్ పెట్టేసిన రాజ‌మౌళి
X

ప్రభాస్ - దీపికా పదుకొణె- అమితాబ్- క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ K అకా `కల్కి 2898 AD` టీజ‌ర్ కామిక్ కాన్ లో విడుద‌లై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సినీ ప్రేమికులను ఆకట్టుకుంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన డిస్టోపియన్ ప్రపంచం వీక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రిచింది. ఈ సినిమా కోసం ప్రపంచ స్థాయి వీ.ఎఫ్‌.ఎక్స్ ని సృష్టించారు. సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీని నాగ్ అశ్విన్ ఎంతో గొప్ప‌గా ఆవిష్క‌రించార‌ని ప్రాజెక్ట్ కే టీజ‌ర్ చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ యూట్యూబ్ లో రికార్డులు తిర‌గరాస్తోంది..

ప్రాజెక్ట్ K టీజ‌ర్ పై సినీప్ర‌ముఖులు ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు SS రాజమౌళి పేరు చేరింది. ద‌ర్శ‌క‌ధీరుడు ఈ సాయంత్రం ట్విట్టర్ లో ప్రాజెక్ట్ కే టీజ‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ ప్రామాణికమైన భవిష్యత్తు చిత్రాన్ని రూపొందించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ - నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ను రాజ‌మౌళి అభినందించారు. ``అబ్బాయిలు మీరు దీన్ని సాధ్యం చేసారు.. డార్లింగ్ స్మాషింగ్ (sic)`` అని రాజమౌళి ట్వీట్ చేశారు. చివ‌రిగా `ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది...విడుదల తేదీ?`` అంటూ రాజ‌మౌళి ప్ర‌శ్నించారు.

`కల్కి 2898 AD` టైటిల్ అభిమానుల‌ను ఆకట్టుకుంది. ఈ టైటిల్ లోనే సూప‌ర్ ప‌వ‌ర్ ఉంది. ఈ చిత్రం వాస్తవానికి 12 జనవరి 2024న థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. రాజమౌళి ప్రశ్న అందరి మదిలో ఉన్న పెద్ద సందేహాన్ని మ‌రింత‌గా రాజేసింది.

ప్రాజెక్ట్ K అనుకున్న ప్రకారం థియేటర్లలోకి వస్తుందా లేదా? భారీత‌నం నిండిన సినిమా కాబ‌ట్టి డెడ్ లైన్ అందుకుంటుందా లేదా? అంటూ సందేహాలు ఉన్నాయి. ఈ చిత్రంలో లెజెండరీ అమితాబ్ బచ్చన్ -కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.