25 ఏళ్ల యువకుడిగా స్టార్ హీరో!
తాజాగా ఈసినిమా రజనీకాంత్ ని ఏకంగా 25 కుర్రాడినే చేసేస్తున్నాడని తాజా సమాచారం. 73 ఏళ్ల రజనీకాంత్ ని 25 ఏళ్ల కుర్రాడిగా మార్చేస్తున్నాడు.
By: Tupaki Desk | 5 Feb 2024 7:32 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కాంబినేషన్ లో సినిమా ప్రకటనతోనే అంచనాలు పీక్స్ కి చేరాయి. తలైవార్ ని లోకేష్ ఎలాంటి రోల్ లో చూపించబోతున్నాడు? అన్న ఉత్సాహం అభిమానుల్లో అంతకంతకు రెట్టింపు అవుతుంది. రజనీని కూడా గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడా? లేక లొకేష్ నుంచి రాబోతున్న మరో సరికొత్త ప్రయత్నం..ప్రయోగం అవుతుందా? అని ఒకటే ఉత్కంఠ నెలకొంది.
తాజాగా ఈసినిమా రజనీకాంత్ ని ఏకంగా 25 కుర్రాడినే చేసేస్తున్నాడని తాజా సమాచారం. 73 ఏళ్ల రజనీకాంత్ ని 25 ఏళ్ల కుర్రాడిగా మార్చేస్తున్నాడు. అందుకోసం డీఏజినింగ్ అనే టెక్నాలజీని వినియోగిస్తున్నాడని సమాచారం. దీన్ని బట్టి రజనీతో లోకేష్ పెద్ద పాత్ర పరంగా పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి అది ఎలా ఉంటుంది? అన్నది ఫస్ట్ లుక్ పోస్టర్ కొంత వరకూ తెలిసే అవకాశం ఉంది.
కబాలి..కాలా...రోబో లాంటి చిత్రాల్లో రజనీ కాంత్ ని వయసు తగ్గించి చూపించిన సంగతి తెలిసిందే. కానీ ఆ వయసు మరీ 40 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లలేదు. పాత్ర అవసరం మేర ప్రోస్తెటిక్ మ్యాకప్ తో ఆ లుక్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా 50 ఏళ్లు వెనక్కి వెళ్లడంతో డీఏజినింగ్ టెక్నాలజీ వినియోగించాల్సి వస్తోందని తెలుస్తోంది. టెక్నాలజీని వాడటంలో లోకేష్ దిట్ట అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా అప్ డేట్ గా ఉంటాడు.
అందుకే కమల్ హాసన్ మెచ్చిన దర్శకుడు అయ్యాడు. తన కథలతో పాటు మనిషి ఎంతో అప్ డేట్ గా ఉంటాడని..అందుకే తన నుంచి గొప్ప సినిమాలు వస్తున్నాయని ఓ సందర్భంలో విశ్వ నటుడు ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా అదే నమ్మకంతో లోకష్ కి అవకాశం ఇచ్చారు. ఈ వార్త అభిమా నుల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా రజనీకాంత్ ని వయసు మళ్లిన పాత్రల్లోనే కనిపి స్తున్నారు. మేకర్స్ అంతా ఆయన వసును దృష్టిలో పెట్టుకునే స్టోరీలు రాస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు కూడా బోరింగ్ గా నే అనిపిస్తుంది. కానీ లోకేష్ మాత్రం తన కథ కోసం అదే రజనీనికి ఏకంగా యువకుడిగానే మార్చేస్తున్నాడు.