రాజ్.. ఆ సినిమాను ఎందుకు వదిలేశాడు?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కెరీర్ ఈ మధ్య ఏమీ బాగా లేదు. వరుసగా అతడి సినిమాలన్నీ బోల్తా కొడుతూనే ఉన్నాయి
By: Tupaki Desk | 1 Aug 2024 7:07 AM GMTయువ కథానాయకుడు రాజ్ తరుణ్ కెరీర్ ఈ మధ్య ఏమీ బాగా లేదు. వరుసగా అతడి సినిమాలన్నీ బోల్తా కొడుతూనే ఉన్నాయి. హీరో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రాజ్.. ఆ తర్వాత నిఖార్సయిన హిట్ ఒక్కటీ ఇవ్వలేకపోయాడు. పుంజుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. క్యారెక్టర్ రోల్ చేసిన ‘నా సామిరంగ’ మినహాయిస్తే చెప్పుకోదగ్గ సినిమాల ఏదీ రాలేదు తన నుంచి. దాని తర్వాత అతను సోలో హీరోగా నటించిన సినిమాలు రెండు రెడీ అయ్యాయి. వాటిలో ముందు ‘తిరగబడరా సామి’ వార్తల్లోకి వచ్చింది. యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ చేస్తున్న టైంలో రాజ్ తరుణ్ ఓ వ్యక్తిగత వివాదంలో చిక్కుకున్నాడు. అప్పట్నుంచి అతను బయటికి రావట్లేదు.
ఐతే తిరగబడరా సామి ఈ శుక్రవారం రిలీజవుతున్న నేపథ్యంలో బుధవారం చిత్ర బృందంతో కలిసి రాజ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. సినిమా గురించి మంచి మాటలు చెప్పాడు. అలాగే తన వ్యక్తిగత వివాదం గురించి అడిగిన ప్రశ్నలకు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఐతే ‘తిరగబడరా సామి’ కంటే ముందే, గత వారం పురుషోత్తముడు అనే రాజ్ తరుణ్ సినిమా ఒకటి విడుదలైంది. ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కిందో, ఎప్పుడు పూర్తయిందో తెలియదు. సడెన్‌గా రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఏమాత్రం బజ్ లేకుండా రిలీజైన ఈ చిత్రాన్ని రాజ్ కూడా ప్రమోట్ చేయలేదు.టాక్ కూడా బాలేకపోవడంతో వీకెండ్ లోనే సినిమా వాషౌట్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్లకు రాజ్ తరుణ్ దూరంగానే ఉన్న రాజ్.. తిరగబడరాసామి ప్రమోషన్లకు మాత్రం వచ్చాడు. ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు పురుషోత్తముడు సినిమాను ఎందుకు ప్రమోట్ చేయలేదని అడిగారు. దీనికి అతను బదులిస్తూ.. అప్పుడు తాను చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నానని.. అందుకే బయటికి రాలేదని సింపుల్‌గా తేల్చేశాడు. కానీ వారం తర్వాత కొత్త సినిమాను సపోర్ట్ చేసిన రాజ్.. ఆ చిత్రాన్ని కూడా పట్టించుకుని ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.