స్టార్ కమెడియన్ ఆస్తి జప్తు చేసిన బ్యాంక్..!
ముంబై సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఇటీవల రాజ్ పాల్ యాదవ్ ఆస్తిని జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 15 Aug 2024 6:07 AM GMTసినిమా ఇండస్ట్రీ కి చెందిన ఎంతో మంది నిర్మాతలు ఆర్థికంగా ఒకానొక సమయంలో కోట్ల లాభాలు దక్కించుకున్న వారు ఉన్నారు, వారే ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక సినిమాపై చాలా నమ్మకంతో కోట్లకు కోట్ల రూపాయలను ఖర్చు చేసే నిర్మాతలు ఆ సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ జీరోకు వస్తారు. అలా ఎంతో మంది నిర్మాతలు సినిమాలు ఫ్లాప్ కావడంతో కనుమరుగు అయిన వారు ఉన్నారు. కొందరు ఆస్తులు అమ్ముకుని అప్పులు కట్టి వెళ్లి పోయిన వారు ఉన్నారు.
హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కమెడియన్ గా సుపరిచితుడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా మరియు నిర్మాతగా కూడా పలు సినిమాలను చేశాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుని స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అలాంటి స్టార్ కమెడియన్ ఆస్తిని బ్యాంకు వారు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముంబై సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఇటీవల రాజ్ పాల్ యాదవ్ ఆస్తిని జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఓం పురి హీరోగా రాజ్ పాల్ యాదవ్ ఒక సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కోసం ముంబై సెంట్రల్ బ్యాంక్ నుంచి రాజ్ పాల్ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడట. ఆ మొత్తం చెల్లించడంలో విఫలం అయ్యాడని, అందుకే రాజ్ పాల్ యాదవ్ తనకా పెట్టిన ఆస్తిని బ్యాంక్ అధికారులు జప్తు చేసి వేలంకు సిద్ధం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. గతంలో తీసుకున్న అప్పు పెద్ద మొత్తంలో పెరిగి ఇప్పుడు చెల్లించలేని పరిస్థితికి రాజ్ పాల్ వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరచడం తో కనీసం బ్యాంక్ లో తీసుకున్న లోను ను తీర్చలేక రాజ్ పాల్ యాదవ్ చేతులు ఎత్తేశాడట.
ముంబై సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్ మీడియా కథనాల అనుసారంగా రాజ్ పాల్ యాదవ్ తనకా పెట్టిన ఆస్తి కంటే కూడా ఆయన తీసుకున్న రుణం ఎక్కువ ఉందని, దాంతో బ్యాంకు అధికారులు ఆయన నుంచి మరో ఆస్తిని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన తనక పెట్టిన ఆస్తిని మాత్రం జప్తు చేసి వేలంకు సిద్ధం చేస్తున్నారు. కమెడియన్ గా ఇప్పటికి పలు సినిమాల్లో నటిస్తున్న రాజ్ పాల్ యాదవ్ కావాలని ఆ బ్యాంక్ లోను ఎగవేస్తున్నాడు అనే వారు కూడా లేక పోలేదు.