Begin typing your search above and press return to search.

లైఫ్ లో పెళ్లికి ఛాన్స్ లేదా.. యువ హీరో షాకింగ్ కామెంట్స్..!

సినిమాల సెలక్షన్ లోపం వల్లే రాజ్ తరుణ్ కెరీర్ ఇలా డైలమాలో పడిందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   22 April 2024 4:30 PM GMT
లైఫ్ లో పెళ్లికి ఛాన్స్ లేదా.. యువ హీరో షాకింగ్ కామెంట్స్..!
X

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఉయ్యాల జంపాల సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ స్టార్టింగ్ లో కాస్త దూకుడు చూపించినా సరే ఆ తర్వాత గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడు. సుకుమార్ దృష్టిలో పడి ఆయన నిర్మాణంలో కుమారి 21F సినిమా చేసిన రాజ్ తరుణ్ ఆ తర్వాత చాలా వెనకపడ్డాడు. సినిమాల సెలక్షన్ లోపం వల్లే రాజ్ తరుణ్ కెరీర్ ఇలా డైలమాలో పడిందని చెప్పొచ్చు.

అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కాస్త కెరీర్ సరైన మార్గంలో ఉండే ఛాన్స్ ఉండేది కానీ రాజ్ తరుణ్ రొటీన్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక ఈమధ్య సోలో ఛాన్సులు రాకపోవడంతో వేరే హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలో నటించాడు రాజ్ తరుణ్.

సినిమాలు తగ్గాయి కదా కుర్రాడు పెళ్లి చేసుకుంటాడా అని ఎవరైనా అడిగితే పెళ్లా.. నేనా.. నో ఛాన్స్ అనేస్తున్నాడు. పెళ్లి, పిల్లల మీద ఒక బలమైన అభిప్రాయంతో ఉన్న రాజ్ తరుణ్ ఏది ఏమైనా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాడట. సింగిల్ గానే హ్యాపీగా ఉన్నానని పెళ్లి, పిల్లలు ఇవేవి తనకు వద్దని అంటున్నాడు రాజ్ తరుణ్. అంతకుముందు తన తండ్రి పెళ్లి గురించి అడిగే వారు ఆ తర్వాత నా ఇష్టమే వారి ఇష్టమని అన్నారు.

అమ్మ కూడా ఇప్పుడు తనని పెళ్లి గురించి అడగకుండా నా అభిప్రాయానికే వదిలేసింది. సోలోగా ఉండటమే తనకు బెటర్ అనిపిస్తుందని అంటున్నాడు రాజ్ తరుణ్. మరి జీవితంలో పెళ్లి అనేది ఒక గొప్ప కార్యం అలాంటిది రాజ్ తరుణ్ పెళ్లిపై ఇలాంటి నిర్ణయంతో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అప్పట్లో ఒక హీరోయిన్ తో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. సినిమా పరిశ్రమకు సంబంధం లేని అమ్మాయితో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ అంటూ కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

కానీ ఇవేవి తన లైఫ్ లో లేవు. సోలో లైఫే సో బెటర్ అని పెద్ద షాకే ఇచ్చాడు రాజ్ తరుణ్. మరి తనకు కావాల్సిన అమ్మాయి లైఫ్ లోకి రాలేదని రాజ్ తరుణ్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేదా పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం ఏదైనా ఉందా అన్నది తెలియదు కానీ రాజ్ తరుణ్ పెళ్లిపై చేసిన కామెంట్స్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తున్నాయి.