Begin typing your search above and press return to search.

అతను అసభ్యకరంగా దాడి చేసాడు: లావణ్య

రాజ్ తరుణ్ మీద ఆరోపణలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసు పెట్టింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 4:04 AM GMT
అతను అసభ్యకరంగా దాడి చేసాడు: లావణ్య
X

రాజ్ తరుణ్, లావణ్య వివాదం రోజురోజుకి ముదిరిపోతోంది. రాజ్ తరుణ్ మీద ఆరోపణలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసు పెట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాజ్ తరుజ్ పోలీస్ నోటీసులు అందుకున్నారు. అయితే అతను తన లాయర్ తో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. రాజ్ తరుణ్ కి చాలా మంది అమ్మాయిలతో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని లావణ్య ఆరోపణలు చేస్తోంది. మాల్వీ మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడని అంటోంది.

రాజ్ తరుణ్ అయితే లావణ్య ఒక డ్రాగ్ అడిక్ట్ అని, అలాగే డ్రగ్ ఫ్లడర్ అని ఆరోపించారు. మస్తాన్ సాయి అనేవాడితో ఆమెకి ఎఫైర్ ఉందని ఆరోపణలు చేశారు. చాలా మందికి లావణ్య డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలని నాశనం చేసిందని తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ తరపున ఆర్జే శేఖర్ భాషా కూడా మీడియా ముందుకొచ్చి లావణ్య మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం లావణ్య ఒక స్టూడియోలో శేఖర్ భాషాని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన తర్వాత వివాదం మరింత పర్సనల్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. రాజ్ తరుణ్ ని జైలుకి పంపించే వరకు వదలనని లావణ్య ఛాలెంజ్ చేస్తోంది. శేఖర్ భాషా ప్రీతి అనే అమ్మాయిని బయటకి తీసుకొచ్చి లావణ్యపై పోలీసులకి కంప్లైంట్ చేయించారు. తనకి లావణ్య బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందని ప్రీతి ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య శేఖర్ భాషా మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శేఖర్ భాషా మా ఇంటికి వచ్చి నా మీద భౌతిక దాడి చేసాడని, నా పొట్టలో తన్నాడని, ప్రైవేట్ పార్ట్స్ మీద ఇష్టానుసారంగా దాడి చేసి మెట్ల మీద నుంచి తోసేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. తనకి గాయాలయ్యాయని మీడియాకి చూపించింది. మరో వైపు శేఖర్ భాషా కూడా తనపై లావణ్యకి సంబందించిన వారు దాడి చేసి గాయపరిచారని పోలీసులకి ఫిర్యాదు చేశారు.

గాయాలతో శేఖర్ భాషా హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజ్ తరుణ్ నుంచి లావణ్య, శేఖర్ భాషా మధ్య వ్యక్తిగత గొడవగా మారిందని అనిపిస్తోంది. వీరి వ్యవహారంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు. ఈ ఇష్యూని ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.