రాజ్ తరుణ్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన లావణ్య
రాజ్ తరుణ్ నేను గుడిలో పెళ్లి చేసుకున్న మాట వాస్తవం అని లావణ్య ప్రెస్ మీట్ లో తెలియజేసింది
By: Tupaki Desk | 9 July 2024 7:52 AM GMTరాజ్ తరుణ్ నేను గుడిలో పెళ్లి చేసుకున్న మాట వాస్తవం అని లావణ్య ప్రెస్ మీట్ లో తెలియజేసింది. 2017కి ముంది 27 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటానని, విజయవాడ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నానని చాలా ఇంటర్వ్యూలో లలో రాజ్ తరుణ్ చెప్పాడు. 2017లో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలైనప్పటి నుంచి తనని దూరం పెడుతూ వచ్చాడు. అలాగే పెళ్లి గురించి అడిగిన తరువాత చూద్దాం అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు. ఫైనల్ గా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేలా చేసాడని లావణ్య ఆరోపించింది.
మా రిలేషన్ గురించి, పెళ్లి గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసని లావణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకున్నాడని, అయితే నాకు అతను తప్ప మరో ఛాయస్ లేదని, ఇప్పటికి కూడా రాజ్ తరుణ్ కావాలని కోరుకుంటున్నానని లావణ్య చెప్పింది. రాజ్ తరుణ్ అంటే నాకు ఇష్టం కాబట్టి అతను కావాలని ఫైట్ చేస్తున్నట్లు లావణ్య మీడియా ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది.
నన్ను వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ అవసరం అయితే జైలుకైనా వెళ్తానని అంటున్నాడని, ఇప్పుడు బయటకొచ్చి ఇలా ఫైట్ చేస్తే ఎవరు యాక్సప్ట్ చేయరు కదా… అతను మోసం చేస్తూ వస్తుంటే ఎన్ని రోజులు భరించడం నా వలన కాదు కదా. అందుకే బయటకి రావాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ కి అతను ఎంత చెప్తే అంత… వారు కొడుకు మాటకి కట్టుబడి ఉంటారు. నేను ఫోన్ చేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేసాను.
మమ్మల్ని అడిగి నిన్ను చేసుకుంటామని చెప్పలేదు. అలాగే ఇప్పుడు కూడా మీ విషయంలో మేము ఏమీ చేయలేమని రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్పేశారని లావణ్య మీడియాకి క్లారిటీ ఇచ్చింది. నేను నా పేరెంట్స్ ని ఎదిరించి రాజ్ తరుణ్ కోసం వచ్చేసాను. అందుకే వారు కూడా ఇప్పుడు నా వైపు నిలబడలేని పరిస్థితి ఉందని లావణ్య తెలిపింది. అతను ఎఫైర్స్ గురించి ప్రశ్నించినందుకు నన్ను పూర్తిగా వదిలించుకోవాలని అనుకుంటున్నాడని లావణ్య ఆరోపణలు చేసింది.
అయితే ఈ ఇష్యూలో ఎవరి వాదనలని వారు స్ట్రాంగ్ గా మీడియా ముందు చెబుతున్నారు. లీగల్ గా వారి దగ్గర ఉన్న ఆధారాలతో ఫైట్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా ముందుకి వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.