Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ వదిలేయాలని బెదిరింపు.. మనీ ఆఫర్: ప్రియురాలి రియాక్షన్

హీరో రాజ్ తరుణ్ తో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాను అంటూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది

By:  Tupaki Desk   |   5 July 2024 9:19 AM GMT
రాజ్ తరుణ్ వదిలేయాలని బెదిరింపు.. మనీ ఆఫర్: ప్రియురాలి రియాక్షన్
X

హీరో రాజ్ తరుణ్ తో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాను అంటూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే తాను రాజ్ తరుణ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాము అంటూ ఒక గుడిలో పెళ్లికూడా చేసుకున్నాము అని మాట్లాడింది. అయితే ఈ విషయం రాజ్ చాలా ప్రైవసీగా ఇచ్చారని కూడా ఆమె వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో మరొక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని ఆమె వల్లే తనకు దూరమవుతున్నాడు అని లావణ్య మరొక విధంగా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె మరెవరో కాదు అని మాల్వీ మల్హోత్రా అని తిరగబడరా సామీ అనే సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి నటించినట్లు ఆమె తెలిపారు. అయితే హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందని ఆమె తమ్ముడు కూడా వాట్సాప్ లలో బెదిరించే విధంగా మెసేజ్లు చేశారు అని ఆమె తెలియజేసింది.

మరిన్ని వివరాలు తెలుపుతూ.. రాజ్ తరుణ్ ని వదిలేయాలి అని మొదట బెదిరించిన వాళ్ళు ఆ తర్వాత మనీ ఆఫర్ కూడా చేశారు. అయితే నేను మాత్రం రాజ్ ను వదిలేయాలని అనుకోవడం లేదు. అయితే ఆమె కావాలని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేశారు అనిపిస్తుంది. రాజ్ తరుణ్ నాతో సంతోషంగా లేడు అని ఆమె నాతో చెప్పింది అయితే అది నేను నమ్మాలని అనుకోవడం లేదు.

కావాలని ఆమె రాజ్ ను తన వైపుకు తిప్పుకుంది అని అనుమానం కలుగుతుంది. ఒకవేళ అతను నిజంగా నాతో హ్యాపీగా లేకపోతే నేను కొద్దిగా ఆలోచించేదాన్ని. అయితే ఆమె క్యారెక్టర్ అసలు మంచిది కాదు. గతంలోనే ఆమె ఒక నిర్మాతపై ఫేక్ కేసు పెట్టింది. తనకు నచ్చకపోతే ఎవరి పైన అయినా కూడా ఆమె కేసులు పెడుతుంది. ఈ విషయంలో నేను ఏమాత్రం వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు. ఆమెను నమ్మడం రాజ్ తరుణ్ కు కూడా అంత క్షేమం కాదు అనిపిస్తోంది.

నా దగ్గర చాలావరకు ఆధారాలు కూడా ఉన్నాయి. నేను రాజ్ తరుణ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని మాకు దగ్గరగా ఉండే వాళ్లకు కొంతమందికి తెలుసు. మరికొందరు యువ హీరోలకు కూడా రాజ్ తరుణ్ నాతో ఉన్నాడు అని తెలుసు. రాజ్ ను మల్హోత్రా అయితే ట్రాప్ చేసిందనే అనిపిస్తోంది. రాజ్ తరుణ్ చాలావరకు మారిపోయాడు. తరచుగా తను టెన్షన్ పడుతున్నాడు. ఆమె ఏది చెప్పినా రాజ్ తరుణ్ అది చేయాలి. లేదంటే అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. మేము ఒక గుడిలో అయితే పెళ్లి చేసుకున్నాము. నా మెడలో అయితే రాజ్ తాళి కట్టారు. మా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసు. అతని మొదటి సినిమా ఉయ్యాల జంపాల సక్సెస్ అయినప్పుడు ఎందుకు అనవసరంగా చెప్పడం అని నేనే సైలెంట్ గా ఉన్నాను. చాలా వరకు సపోర్ట్ చేశాను అని లావణ్య తెలిపారు