Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ న్యూ మూవీ.. ఈ టైమ్ లోనా?

రాజ్ తరుణ్ హీరోగా పురుషోత్తముడు అనే మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కింది.

By:  Tupaki Desk   |   15 July 2024 6:53 AM GMT
రాజ్ తరుణ్ న్యూ మూవీ.. ఈ టైమ్ లోనా?
X

రాజ్ తరుణ్ హీరోగా పురుషోత్తముడు అనే మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అండ్ డ్రామా ఎలిమెంట్స్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ నుంచి కాస్తా పాజిటివ్ బజ్ తో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. అలాగే బ్రహ్మానందం, బ్రహ్మాజీ కూడా ఇంటరెస్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్ తరుణ్ వివాదంలో ఇరుక్కున్నాడు. అతని మాజీ ప్రియురాలు లావణ్య రాజ్ తరుణ్ తో న్యాయపోరాటం చేస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో 11 ఏళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు వదిలించుకున్నాడని కేసు పెట్టింది. రాజ్ తరుణ్ మీద కేసు నమోదు అయ్యింది. దీనిపై అతను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసిన మొదటి రోజు అతను మీడియా ముందుకొచ్చారు. లావణ్య మీద చాలా ఆరోపణలు చేశారు.

తరువాత మళ్ళీ బయటకి రాలేదు. తిరగబడర సామి సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీగా నటించిన మాల్వీ మల్హోత్రా కూడా కేసులో ఇరుక్కుంది. రాజ్ తరుణ్, మాల్వీకి అఫైర్ ఉందని లావణ్య ఆరోపించిన నేపథ్యంలో వారిద్దరి టాపిక్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ కారణంగానే తిరగబడర సామి మూవీ రిలీజ్ ఆగష్టుకి వాయిదా వేశారు. అయితే ఊహించని విధంగా రాజ్ తరుణ్ పురుషోత్తముడు జులై 26న కన్ఫర్మ్ చేసేసారు. సడెన్ గా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది.

అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ వ్యవహారం అంతా గందరగోళంగా ఉంది. ఇలాంటి సమయంలో మూవీ రిలీజ్ అంటే కచ్చితంగా రిస్క్ చేస్తున్నట్లే చెప్పాలి. మూవీ ప్రమోషన్స్ కి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకొస్తే సినిమా మ్యాటర్ పక్కకి వెళ్ళిపోయి లావణ్య గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దానికి తోడు అదే రోజు ధనుష్ రాయన్ మూవీ రిలీజ్ అవుతోంది.

పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రాయన్ సినిమాకి పోటీగా పురుషోత్తముడు రిలీజ్ చేస్తే నిలబడుతుందా అనేది చెప్పలేని విషయం. రాజ్ తరుణ్ వివాదంతో పాటు రాయన్ సినిమా ఇంపాక్ట్ పురుషోత్తముడు సినిమాపై గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరి చిత్ర యూనిట్ పునరాలోచించి ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.