రిలేషన్ లో ఉన్న… రాజ్ తరుణ్ ఓల్డ్ వీడియో
హీరో రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 7 July 2024 10:25 AM GMTహీరో రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ నేను 11 ఏళ్ళ నుంచి రిలేషన్ లో ఉన్నామని, ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని నన్ను దూరం పెట్టాడని లావణ్య ఆరోపణలు చేసింది. దీనిపై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తరువాత మీడియాతో కూడా రాజ్ తరుణ్ పైన సంచలన ఆరోపణలు చేసింది. అలాగే మాల్వీ మల్హోత్రా మీద కూడా లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది.
ఆమె తనని చంపేస్తానని బెదిరిస్తుందని ఆరోపించింది. లావణ్య ఫిర్యాదుతో ఒక్కసారి రాజ్ తరుణ్ న్యూస్ వైరల్ గా మారింది. లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చున్నాడు. లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని చెప్పాడు. 2-3 ఏళ్ళు ఇద్దరం ఇష్టపూర్వకంగా రిలేషన్ లో ఉన్నామని అన్నాడు. తరువాత ఆమెని భరిస్తూ వచ్చానని అన్నాడు. లావణ్య డ్రగ్స్ కి, చెడు స్నేహాలకి అలవాటుపడిందని రాజ్ తరుణ్ తెలిపాడు.
తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆమె ఎన్ని చేసిన భరిస్తూ వచ్చానని రాజ్ తరుణ్ మీడియాకి వివరించాడు.. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత బయటకి వచ్చేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమెని దూరం పెట్టడం జరిగిందని అన్నాడు. అయితే మాల్వీ మల్హోత్రా పరిచయం తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెడుతూ వచ్చాడని లావణ్య ఆరోపించింది.
ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం రాజ్ తరుణ్ ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి రాజ్ తరుణ్ ఓపెన్ అప్ అయ్యాడు. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నానని అందులో పేర్కొన్నాడు. అయితే ఆ రిలేషన్ షిప్ ఎంత వరకు ఉంటుందనేది చెప్పలేనని అన్నాడు. నాకు పెళ్లి మీద ఒపీనియన్ లేదని, చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని సదరు ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ చెప్పాడు.
ఇప్పటికి రాజ్ తరుణ్ అదే మాట చెబుతున్నాడు. పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని, లావణ్యతో రిలేషన్ షిప్ లో ఉన్న మాట వాస్తవం అని క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకి ఎప్పుడు ప్రామిస్ చేయలేదని అన్నాడు. అలాగే గుడిలో పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పిన మాటలు పచ్చి అబద్ధం అని రాజ్ తరుణ్ తన వెర్షన్ చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ ఇష్యూతో మరోసారి అతని ఓల్డ్ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.