Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

హీరో హీరోయిన్లు కలిసి చక్కర్లు కొడుతున్న షాట్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరోను టెంప్ట్ చేయాలని హీరోయిన్ ట్రై చేస్తుంటుంది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 1:22 PM GMT
రాజ్ తరుణ్ భలే ఉన్నాడే.. ట్రైలర్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. లావణ్య అనే యువతి.. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని కాపురం చేశారని, ఇప్పుడు వదిలేశారని ఆరోపణలు చేసింది. అబార్షన్ కూడా చేయించారని ఆరోపించింది. రోజుకో మలుపు తిరిగిన ఆ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. అయితే సినిమా విషయంలో మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నారు రాజ్ తరుణ్. వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే జూలై, ఆగస్టు నెలల్లో రెండు సినిమాలతో అలరించిన రాజ్ తరుణ్.. ఇప్పుడు మరో సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. భలే ఉన్నాడే మూవీతో రానున్నారు. శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన భలే ఉన్నాడే మూవీ సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ .. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అదే జోష్ తో రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. ఇంతకుముందు ఇలాంటి కథతో ఎలాంటి సినిమా రాలేదని టీజర్ చూసి చెప్పేయొచ్చు. సినిమాలో రాజ్ తరుణ్ చీర కట్టే వృత్తి చేస్తాడని, గే అని టీజర్ ద్వారా తెలుస్తోంది. అయితే తాజాగా భలే ఉన్నాడే మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

హీరో హీరోయిన్లు కలిసి చక్కర్లు కొడుతున్న షాట్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరోను టెంప్ట్ చేయాలని హీరోయిన్ ట్రై చేస్తుంటుంది. ఆ తర్వాత అతడిని తన బుట్టలో వేసుకున్నట్లు కనిపిస్తోంది. అనంతరం ట్రైలర్ ఒక్కసారిగా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. హీరోయిన్ పేరెంట్స్.. హీరో తాలుకా వాళ్లను నిందించడం, హీరో తనకు జీవితం వద్దని అరవడం.. అలా ఆసక్తి రేపే సీన్స్ ను చూపించారు మేకర్స్. ట్రైలర్ సరైన రీతిలో కట్ చేసి మూవీపై అంచనాలు పెంచారు.

అయితే రాజ్ తరుణ్ యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉంది. మనీష తన అందం అండ్ అభినయంతో అలరిస్తోంది. హైపర్ ఆది కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఎమోషనల్ టచ్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఫ్రెష్ అండ్ సరిగ్గా సెట్ అయింది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్.. మెప్పిస్తోంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.