Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ కి బిరుదు ఇచ్చిన 'పురుషోత్తముడు'

సినిమాల్లో ఎక్కువగా జోవియల్‌ గా ఉండే పాత్రలను చేయడంతో పాటు, నిజ జీవితంలో కూడా స్నేహితులు మరియు సన్నిహితులతో చాలా జోవియల్ గా రాజ్ తరుణ్ ఉంటాడు.

By:  Tupaki Desk   |   26 July 2024 10:12 AM GMT
రాజ్ తరుణ్ కి బిరుదు ఇచ్చిన పురుషోత్తముడు
X

యూట్యూబ్‌ వీడియోలతో పాపులారిటీని సొంతం చేసుకుని, నటుడిగా మంచి పేరు దక్కించుకుని ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కించుకున్న రాజ్‌ తరుణ్‌ తక్కువ సమయంలో మాస్‌ హీరో గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

మొదటి సినిమా ఉయ్యాల జంపాల హిట్ నేపథ్యంలో ఆ సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈయన చేసిన సినిమా చూపిస్త మావ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మాస్ లో రాజ్‌ తరుణ్‌ కి మంచి ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయ్యింది.

ఆ సమయంలోనే చాలా మంది రాజ్ తరుణ్ కు జూనియర్‌ మాస్ మహారాజా బిరుదు అయితే బాగుంటుంది అనే అభిప్రాయం ను వ్యక్తం చేశారు. కానీ ఏ సినిమా టైటిల్‌ కార్డ్‌ లో కూడా అలా వేయలేదు. కానీ తాజాగా కొత్త సినిమాలో బిరుదు తో రాజ్ తరుణ్ సందడి చేశాడు.

రాజ్ తరుణ్ తాజా చిత్రం 'పురుషోత్తముడు'. రామ్‌ భీమన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హాసిని సుధీర్‌ హీరోయిన్‌ గా నటించింది. శ్రీదేవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టైటిల్‌ కార్డ్స్ లో రాజ్ తరుణ్‌ పేరు కు ముందు బిరుదుగా జోవియల్ స్టార్‌ అంటూ చేర్చారు.

సినిమాల్లో ఎక్కువగా జోవియల్‌ గా ఉండే పాత్రలను చేయడంతో పాటు, నిజ జీవితంలో కూడా స్నేహితులు మరియు సన్నిహితులతో చాలా జోవియల్ గా రాజ్ తరుణ్ ఉంటాడు. అందుకే ఆయనకు ఈ బిరుదు సరిగ్గా సెట్‌ అవుతుంది అనే అభిప్రాయంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రాజ్‌ తరుణ్ సినీ కెరీర్ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లతో దూసుకు పోవడం లేదు. మరో వైపు లావణ్య అనే అమ్మాయి తనను రాజ్ తరుణ్ మోసం చేశాడు అంటూ ఫిర్యాదు చేయడంతో పాటు, హీరోయిన్‌ మాల్వి మల్హోత్ర తో ప్రేమలో ఉన్నాడని ఆరోపించింది.

ఇలాంటి సమయంలో రాజ్‌ తరుణ్ కెరీర్‌ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరికీ ఉంది. జోవియల్‌ స్టార్‌ బిరుదు ఇతర సినిమాలకు కంటిన్యూ అయ్యే విధంగా రాజ్ తరుణ్‌ హిట్స్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.