రాజ్ తరుణ్ న్యూ మూవీ బిజినెస్.. పరిస్థితి ఎలా ఉందంటే..
రాజ్ తరుణ్ కారణంగా ఈ సినిమాకి బిజినెస్ పరంగా ఏమైనా నష్టం వచ్చిందా అని ఓ జర్నలిస్ట్ నిర్మాతని అడిగారు. దీనిపై నిర్మాత రమేష్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.
By: Tupaki Desk | 24 July 2024 7:02 AM GMTరాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన పురుషోత్తముడు మూవీ జులై 26న థియేటర్స్ లోకి రాబోతోంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని రెడీ చేశారు. శ్రీమంతుడు, మహర్షి సినిమాల తరహాలో పురుషోత్తముడు మూవీ ఉందనే టాక్ పబ్లిక్ లో ఉంది. ఇది ఓ విధంగా సినిమాకి పాజిటివిటీ పెంచేది అని చెప్పాలి.
చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ నుంచి మంచి పాజిటివ్ వైబ్ తో పురుషోత్తముడు మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. అయితే ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ కి ముందు రాజ్ తరుణ్ వ్యక్తిగత గొడవల్లో ఇరుక్కున్నారు. దీంతో పురుషోత్తముడు మూవీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాడు. తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో రాజ్ తరుణ్ పాల్గొనలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు దర్శక, నిర్మాతలని రాజ్ తరుణ్ గురించి ప్రశ్నించారు.
రాజ్ తరుణ్ కారణంగా ఈ సినిమాకి బిజినెస్ పరంగా ఏమైనా నష్టం వచ్చిందా అని ఓ జర్నలిస్ట్ నిర్మాతని అడిగారు. దీనిపై నిర్మాత రమేష్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు చాలా పరిణితితో ఆలోచిస్తారు. మూవీ కంటెంట్ ని, అందులో నటించిన యాక్టర్స్ పాత్రలని మాత్రమే చూసి సినిమాని సక్సెస్ చేస్తారు. ఒక సినిమా వెనుక 2 వేల మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఈ విషయాలు ప్రేక్షకులకి తెలుసు. కచ్చితంగా మా పురుషోత్తముడు సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నామని చెప్పారు.
మూవీ బిజినెస్, రిజల్ట్ పై మేము ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. క్వాలిటీ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆటోమేటిక్ గా సక్సెస్ ఇస్తారని అన్నారు. రాజ్ తరుణ్ వ్యక్తిగత సమస్యల కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాడు. అయితే ప్రమోషన్స్ మాత్రం చాలా యాక్టివ్ గా చేస్తున్నాం. ఇప్పటికే పురుషోత్తముడు కంటెంట్ ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులకి చేరువ అయ్యిందని నిర్మాత తెలిపారు.
రాజ్ తరుణ్ వ్యక్తిగత కారణాల వలన ఈ మూవీ ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోయారు. వీడియో బైట్స్ ఇస్తామని చెప్పారు. అయితే ఫోన్ కి అందుబాటులో లేరు. ఆయన సమస్యలకి మూవీలో క్యారెక్టర్ కి అస్సలు సంబంధం లేదు. పురుషోత్తముడు సినిమాలో హీరో పాత్రకి రాజ్ తరుణ్ పూర్తిగా న్యాయం చేసాడని, అతని విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని దర్శకుడు రామ్ భీమన తెలిపారు.