సెలబ్రిటీస్ సినిమాను కాపాడలేరు..!
తాను హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా కానీ నిర్మాతగా మారి తప్పు చేశానని అన్నారు.
By: Tupaki Desk | 6 Nov 2024 10:09 AM GMTఒక సినిమా టీజర్, ట్రైలర్ ఈవెంట్ కు సెలబ్రిటీ రావడం అనేది ఈమధ్య బాగా చూస్తున్నాం. సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లడం కోసం సెలబ్రిటీ ద్వారా రిలీజ్ చేస్తే దానికి ఎంతోకొంత రీచ్ ఉంటుందని అలా చేస్తారు. ఐతే లేటెస్ట్ గా రాకేష్ వర్రె లీడ్ రోల్ లో విరించి వర్మ డైరెక్షన్ లో వస్తున్న జితేందర్ రెడ్డి ప్రెస్ మీట్ లో తమ సినిమా కోసం సెలబ్రిటీస్ ట్రై చేస్తున్నామని మెసేజ్ లు చేస్తున్నామని అన్నారు రాకేష్ వర్రె.
తాను హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా కానీ నిర్మాతగా మారి తప్పు చేశానని అన్నారు. తాను నాలుగేళ్ల నుంచి సినిమా కోసమే పనిచేశానని.. ఎవరికీ చెప్పొద్దు తర్వాత జితేందర్ రెడ్డి సినిమా చేస్తూ మరోపక్క పేకమేడలు సినిమా చేశాను. ఆ సినిమా అసలు చేయకుండా ఉండాల్సిందని అన్నారు రాకేష్. ఒక సినిమా ఆడాలంటే మార్కెటింగ్, కంటెంట్ ఉండాలి. సినిమాకు వచ్చే సెలబ్రిటీస్ వల్ల సినిమా ఆడదని చెప్పారు రాకేష్.
జితేందర్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ కు సెలబ్రిటీస్ ట్రై చేస్తున్నామని. కానీ కుదరట్లేదని అన్నారు. ఇక ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కుదరక ఈ సమ్మర్ అనుకున్నాం.. కానీ అప్పుడు రిలీజ్ చేయడం కుదరక జూలై అనుకున్నాం. ఇప్పుడు నవంబర్ 8న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం అయినా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియదని అన్నారు రాకేష్.
ఇక తన సినీ ఫెలోస్ కి కంటెంట్ తో సినిమా చేసి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లకు చూపించండి. సెలబ్రిటీస్ వల్ల సినిమాకు ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు రాకేష్. ఇక జితేందర్ రెడ్డి కథ ఒక తమ్ముడు తన అన్న మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. తాను మాత్రం ఒక మంచి కమర్షియల్ సినిమాలానే ఈ సినిమా చేశానని అన్నారు. ఐతే ఈ సినిమాను జితేందర్ రెడ్డి గురిచి తెలిసిన వారు.. జితేందర్ రెడ్డి చూసి స్పూర్తి పొందిన వారు.. జితేందర్ రెడ్డి అంటే ఇష్టం ఉన్న వారు చూడాలని రాకేష్ అన్నారు. రాకేష్ స్పీచ్ చూస్తే ఈ సినిమా ను రిలీజ్ కాకుండా అడ్డు పడుతున్నది ఎవరు అన్న డిస్కషన్ మొదలైంది.
జితేందర్ రెడ్డి సినిమాను విరించి వర్మ డైరెక్ట్ చేశారు. ఉయ్యాల జంపాల, మజ్ను తర్వాత విరించి వర్మ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 1980 కాలంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా జితేందర్ రెడ్డిని తెరకెక్కించారు.