Begin typing your search above and press return to search.

కర్ణుడి కథ.. పర్ఫెక్ట్ హీరో సెట్టయ్యాడు

ఇప్పటివరకు మహాభారతం నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో కర్ణుడి పాత్ర హైలైట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 3:41 AM GMT
కర్ణుడి కథ.. పర్ఫెక్ట్ హీరో సెట్టయ్యాడు
X

ఇప్పటివరకు మహాభారతం నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో కర్ణుడి పాత్ర హైలైట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు కర్ణుడి కథ ఆధారంగా ఒక సోలో చిత్రం మాత్రం రాలేదు. ఫిల్మ్ మేకర్స్ ఈ అనన్యమైన కథను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ, అది కార్యరూపం దాల్చలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన 'కల్కి 2898AD' సినిమాలో ప్రభాస్ కాసేపు కర్ణుడిగా కనిపించి అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.

మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నా, కర్ణుడి పట్ల జనాలకున్న ఆసక్తి ఎంతో ప్రత్యేకం. కర్ణుడు పుట్టుక నుంచి అనేక విభిన్నతలతో చరిత్రలో నిలిచిన యోధుడు. కర్ణుడి గాథ మహాభారతంలో అత్యంత ఆకర్షణీయమైనది, అది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అదేవిధంగా, విక్రమ్ హీరోగా ఒక మలయాళ దర్శకుడు కర్ణుడి కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.

ఆ తర్వాత సూర్య హీరోగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా ఈ కథతో సినిమా తీయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించిన సమాచారంపై పెద్దగా క్లారిటీ రాలేదు. అయితే ఫైనల్ గా, ఈ ప్రాజెక్ట్ నిజమని రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా స్వయంగా మీడియాకు వెల్లడించారు. సూర్యతో కలసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

కర్ణుడి పాత్రను సూర్య లాంటి నటుడు పోషించడం ఖచ్చితంగా ఆ పాత్రకు ఎనలేని వెయిట్‌ను తెస్తుందని రాకేశ్ పేర్కొన్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. దీని కోసం ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారని తెలుస్తోంది. రెండు భాగాలుగా నిర్మించే అవకాశం ఉందట. బాలీవుడ్‌లో ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చిన రాకేశ్, ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

సూర్య, కర్ణుడి పాత్రలో కనిపించనున్నారు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మహాభారతంలో కర్ణుడి పాత్రను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లే విధంగా సినిమా స్క్రిప్ట్‌ను రూపొందించారట. ఇందులో కర్ణుడి విజయాలు, విఫలాలు, ఎమోషనల్ సన్నివేశాలు సరికొత్తగా ఉండబోతున్నాయట.

ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌తో పాటు ఇతర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సూర్య లాంటి టాలెంటెడ్ నటుడు ఈ పాత్రలో కనిపిస్తే కర్ణుడి పాత్రకు మరింత ప్రాధాన్యత ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ సినిమాలుగా మాత్రమే కాకుండా, ఒక ఎపిక్ మూవీగా నిలిచేలా రూపొందించడానికి రాకేశ్ మెహ్రా, సూర్య టీం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ 2025లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.