దుబాయ్ లో దుర్భర జీవితం నిజమేనా?
ఈనేపథ్యంలో అమ్మడు దుబాయ్ లో తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది.
By: Tupaki Desk | 11 Nov 2024 5:50 AM GMTబాలీవుడ్ నటి రాఖీ సావంత్ కొంత కాలంగా దుబాయ్ లో ఉంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. అయితే అదంతా అప్పుడు ఆనందంలో బాధ బంధీ లేని సమయంలోచేసిన పని. తాజాగా అమ్మడు సీన్ అక్కడ వేరే లెవల్లో ఉంది. ఈనేపథ్యంలో అమ్మడు దుబాయ్ లో తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది. `దుబాయ్ లో దుర్బరజీవితం గడుపుతున్నా. నేను ఎంత సహాయం కోరినా, ఎంతమందిని అడిగినా ఫలితం ఉండటం లేదంది.
మరి అలాంటప్పుడు మీరు బాలీవుడ్ హీరోల్నే సహాయం అడగొచ్చుగా అని ప్రశ్నించగా దానికి ఇలా స్పందించింది. `నేను ఎవరినీ సహాయం అడగను. ఇది నా పోరాటం. ఒక్క నిమిషంలో నాకు బెయిల్ ఇవ్వగలరని నేను షారూఖ్ , సల్మాన్‌లను అదగ్గొచ్చు. కానీ ఆపని చేయను. ఈ యుద్ధంలో నేనే పోరాడతాను`అని తెలిపింది. మరి రాఖీ సావంత్ కి ఈ పరిస్థితి ఎందుకు దాపరించినట్లు? అంటే పాస్ట్ లోకి వెళ్లాల్సిందే. మైసూర్ వ్యాపారవేత్త ఆదిల్ ఖాన్ ని 2022లో రాఖీసావంత్ వివాహం చేసుకుంది.
ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లైన కొత్తలో ఎన్నో బహుమతులు అందించాడు. కానీ ఆ బంధం నిలవలేదు. దీంతో రాఖీ సావంత్ ఆదిల్ పై రాఖీ లైంగిక ఆరోపణల కేసు వేసింది. ఈ నేపథ్యంలో ఆదిల్ కొంతకాలం జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి రాఖీ తనకు చేసిన మోసంపై కేసులు వేసాడు. మోసం, దొంగతనం కేసు వేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో రాఖీ సావంత్ దుబాయ్ పారిపోయింది.
రాఖీ సావంత్ ఇప్పుడు భారత దేశానికి వస్తే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆమెని చాలా విషయాల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆమె పోలీసు చేతికి చిక్కితే కదా. మరి రాఖీ సావంత్ మీడియాకి చెప్పిన ఆ పరిస్థితిల్లో నిజం ఉందా? లేక మరేదైనా గేమ్ ప్లాన్ చేసిందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.