పాకిస్తానీ నటితో సల్మాన్ ఖాన్ పెళ్లి?
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కోసం పిల్లను వెతికింది నటి రాఖీ సావంత్. సల్మాన్ వధువు ప్రముఖ పాకిస్తానీ నటి హనియా.
By: Tupaki Desk | 3 March 2025 11:00 PM ISTబాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కోసం పిల్లను వెతికింది నటి రాఖీ సావంత్. సల్మాన్ వధువు ప్రముఖ పాకిస్తానీ నటి హనియా. సోమీ అలీ(సల్మాన్ మాజీ ప్రేయసి)తో స్నేహం చేసిన సల్మాన్ ఇప్పుడు హనియాను పెళ్లాడితే తప్పు లేదని అంది. నిజానికి రాఖీ సావంత్ సోషల్ మీడియా డ్రామాల గురించి ప్రజలకు తెలుసు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ ఇంటివాడు కావాలని కోరుకుంటూ ఆటపట్టించింది. పాకిస్థానీ నటి హనియా అమీర్‌ను తన కోడలు అని పిలవడమే గాక...నిజ జీవితంలో సల్మాన్ - హనియా ఇద్దరినీ కలిసి చూడటం ఆసక్తిగా ఉంటుంది అని వ్యాఖ్యానించింది. అంతేకాదు సల్మాన్- హనియా కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నాని రాఖీ సావంత్ ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం సికందర్ విడుదల టెన్షన్స్ లో ఉన్నాడు. ఏ.ఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇంతలోనే రాఖీ సావంత్ సల్మాన్ భాయ్ జాతకం గురించి మాట్లాడటం మొదలు పెట్టింది. ముఖ్యంగా అతడు పెళ్లి చేసుకోవాలని కోరుతోంది. అయితే సల్మాన్ భాయ్ పెళ్లి మూడ్ లో ఉన్నాడా లేడా? అన్నది ఇప్పుడే చెప్పలేం.
సల్మాన్- హనియా జంటను ఒక చోటికి చేర్చి ఉన్న వీడియోను రాఖీ సావంత్ స్వయంగా షేర్ చేసింది. బాలీవుడ్‌కి వచ్చి సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయాలని కూడా హనియాకు సూచించింది. అలాగే ఇండియా - పాక్ క్రికెట్ జట్ల జెర్సీలను ధరించి రాఖీ కనిపించింది. దిల్జిత్ దోసాంజ్ , హనీ సింగ్‌లతో హనియా ఆల్బమ్ గురించి ప్రశంసించగా, హనియా త్వరలో బాలీవుడ్‌లో ప్రవేశిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. హనియా గురించి సల్మాన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడతానని కూడా ఆమె పేర్కొంది. ఇండియా-పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న బజరంగీ భాయిజాన్ తరహాలో సల్మాన్ - హనియా ఒక సినిమా చేయాలని రాఖీ కోరుకుంది. సల్మాన్ హనియాను వివాహం చేసుకోవాలని కూడా సరదాగా పట్టుబట్టింది.
సోమీ అలీ మీ స్నేహితురాలు కాగలిగితే హనియా ఎందుకు మీ భార్య కాకూడదు? అని రాఖీ బోల్డ్ గా ప్రశ్నించింది. అయితే రాఖీ సావంత్ డీగ్రేడ్ ఆర్టిస్టుగా స్థిరపడింది. తన మాటలను ఎవరూ పట్టించుకోరు. సల్మాన్ కానీ, హనియా కానీ పట్టించుకుంటారేమో చూడాలి.