Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ పేరు వాడ‌కం తెలివి త‌క్కువ‌త‌నం

అయితే అంత పెద్ద సూప‌ర్ స్టార్ పేరును ప‌బ్లిక్ వేదిక‌ల‌పై త‌ప్పుగా ఉప‌యోగించుకోవాల‌ని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? తీవ్ర ప‌రిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 Jan 2025 4:07 AM GMT
ప్ర‌భాస్ పేరు వాడ‌కం తెలివి త‌క్కువ‌త‌నం
X

డార్లింగ్ ప్ర‌భాస్ రేంజ్ ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్. ఒక హాలీవుడ్ హీరోకి ధీటుగా భారీ కాన్వాస్ ఉన్న సినిమాల‌తో స‌త్తా చాటుతున్నాడు. అత‌డు న‌టించిన బాహుబ‌లి-బాహుబ‌లి 2, సాహో, స‌లార్, క‌ల్కి 2898 ఏడి ఇవ‌న్నీ హాలీవుడ్ ప్రమాణాల‌తో విడుద‌లై అబ్బుర‌ప‌రిచాయి. దేశంలో నేడు ఖాన్ ల త్ర‌యాన్ని మించిన స్టార్ గా ఎదిగాడు. స‌ల్మాన్ ఖాన్, షారూఖ్‌, అమీర్ ఖాన్ ల‌ సినిమాల‌ను మించి వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాడు. అత‌డి ఫ్లాప్ సినిమా కూడా 200 కోట్ల వ‌సూళ్ల‌ను సునాయాసంగా తెస్తోంది.

అయితే అంత పెద్ద సూప‌ర్ స్టార్ పేరును ప‌బ్లిక్ వేదిక‌ల‌పై త‌ప్పుగా ఉప‌యోగించుకోవాల‌ని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? తీవ్ర ప‌రిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో డీగ్రేడ్ సినిమాల్లో న‌టించిన రాఖీ సావంత్ ఒక రియాలిటీ షోలో ప్ర‌భాస్ పేరును ఉప‌యోగించుకుంది. తాను ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించాన‌ని తాజాగా రాఖీ వ్యాఖ్యానించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రాఖీ సావంత్ ప్ర‌భాస్ గురించి వ్యాఖ్యానించింది.

ఈ కామెడీ షోకి రాఖీ జడ్జి కాగా, సమయ్ రైనా, మున్నావర్ ఫరూఖీ వంటి సోషల్ మీడియా ప్రభావశీలులు న్యాయనిర్ణేతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక ప్ర‌తిభావంతుడు వేదిక‌పై న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. అంద‌రినీ మెప్పించాడు. అయితే అత‌డికి ఏ న‌టుడు స్ఫూర్తి? అని ప్ర‌శ్నించ‌గా, నిస్సందేహంగా సౌత్ సూపర్ స్టార్ ప్ర‌భాస్ స్ఫూర్తి అని చెప్పాడు. వెంట‌నే రాఖీ సావంత్‌ ప్రభాస్‌తో కలిసి ఓ పాటలో పనిచేశానని చెప్పుకొచ్చింది. అయితే రాఖీ నిజ‌మే చెబుతోందా? అంటూ అభిమానులు డైల‌మాలో ప‌డ్డారు.

అస‌లు రాఖీ సావంత్ లాంటి డిగ్రేడ్ న‌టి ప్ర‌భాస్ తో పాట‌లో నటించడమా? ఎప్పుడూ చూడ‌లేదంటూ నెటిజ‌నులు చుర‌క‌లు వేస్తున్నారు. కొంద‌రు అయితే బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ గా న‌టించిందేమో అంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.