Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మ బ్రదర్స్.. రాఖీ జోష్

నేడు రాఖీ పండగ. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు తమ సోదరులకు ప్రేమగా రాఖీలు కట్టుకుంటారు. తమ సోదరుడి రక్ష కోరి రాఖీ కడుతూ ఉంటారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 6:31 AM GMT
బుట్టబొమ్మ బ్రదర్స్.. రాఖీ జోష్
X

నేడు రాఖీ పండగ. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు తమ సోదరులకు ప్రేమగా రాఖీలు కట్టుకుంటారు. తమ సోదరుడి రక్ష కోరి రాఖీ కడుతూ ఉంటారు. సెలబ్రెటీలు సైతం ఈ పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తన సోదరులకు రాఖీ కట్టింది. ఈ రాఖీ కట్టే సమయంలో పూజా హెగ్డే చక్కగా సంప్రదాయ దుస్తుల్లో మెరవడం విశేషం.


బ్లూకలర్ స్లీవెలెస్ చూడీదార్ ధరించింది. చాలా అందంగా కనపడుతోంది. తన అన్నలు, తమ్ముళ్లకు రాఖీ కట్టి, వారికి స్వీట్లు తినిపించింది. తన తమ్ముళ్లకు ఆశీర్వాదం కూడా ఇవ్వడం విశేషం. ఆ అందమైన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, ఓ బ్యూటిఫుల్ క్యాప్షన్ కూడా పెట్టడం విశేషం. 'రాఖీలు, మిఠాయిలు, గప్‌చుప్‌, గిఫ్ట్‌లు, చాలా రేర్ గా పాదాలకు నమస్కరించే దృశ్యాలు, ఒక సోదరికి ఇంతకంటే ఏం కావాలి' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


పూజా కెరీర్ విషయానికి వస్తే, నిన్న, మొన్నటి వరకు వరస సినిమాలతో దూసుకుపోయింది. ఈ మధ్యే కాస్త జోరు తగ్గింది. టాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు వచ్చినట్లే వచ్చి, రెండు చేజారిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. అయితే, కథలు వింటున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో పూజ తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు.మొదట్లో అందరూ బ్యాడ్ లక్ అనుకున్నారు. కానీ, తర్వాతే తాను అందరికీ గోల్డెన్ లెగ్ మారిపోయింది. రెండు వరస ప్లాప్ ల తర్వాత ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయి కి చెక్కేసింది.


ఇక టాలీవుడ్ లో పూజ కెరీర్ అయిపోయినట్లే అనుకునే సమయంలో ఆమెకు అలవైకుంఠ పురంతో హిట్ పడింది. అంతే, అక్కడి నుంచి పూజ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన ఆమే నటించింది. యువ హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, పూజా స్థానాన్ని చేరుకోలేకపోయారు. కానీ, ఇటీవల కొన్ని కారణాల వల్ల ఆమె రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం గమనార్హం. మళ్లీ, కొత్త ఏ సినిమా సంతకం చేసినట్లు సమాచారం లేదు.