Begin typing your search above and press return to search.

సమంత సిరీస్ పై రూమర్స్.. మేకర్స్ రెస్పాన్స్ ఇలా..

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సిటడెల్ హనీ బన్ని వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 9:52 AM GMT
సమంత సిరీస్ పై రూమర్స్.. మేకర్స్ రెస్పాన్స్ ఇలా..
X

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సిటడెల్ హనీ బన్ని వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ వెబ్ సిరీస్ తో సామ్.. అందరినీ మెప్పించింది. యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన టాలెంట్ తో ఔరా అనిపించింది. ఇప్పుడు మరో సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సిరీస్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయింది. సిటాడెల్ తో పాటు ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వెబ్ సిరీసులతో ఆకట్టుకున్న రాజ్, డీకే.. రక్త్ బ్రహ్మాండ్ కు నిర్మాతలుగా, క్రియేటర్లుగా వ్యవహరిస్తున్నారు. తుంబాడ్ ఫేమ్ రాహిల్ అనిల్ బార్వే.. సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే రక్త్ బ్రహ్మండ్ సిరీస్ నిలిచిపోయిందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. ఆడిట్ నిర్వహించిందని, ఆ సమయంలో రూ.2 కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలిందని వార్తలు వచ్చాయి. దీంతో కొద్ది రోజుల పాటు షూటింగ్ నిర్వహించిన తర్వాత.. రక్త్ బ్రహ్మాండ్ నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది.

అలా సమంత అప్ కమింగ్ సిరీస్ నిలిచిపోయినట్లు ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో మేకర్స్ స్పందించారు. సిరీస్ క్రియేటర్స్ రాజ్, డీక్ ట్వీట్ చేశారు. షూటింగ్ కు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేశారు. కొందరు ఎప్పుడూ ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తారని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నారు.

ముఖ్యంగా ప్రజలు ఏది కావాలంటే అది అనేస్తారని, సైలెంట్ గా ఉండడమే వాటికి ఉత్తమమైన రెస్పాన్స్ అని తెలిపారు. తాము కొత్త, ఒరిజినల్ స్టోరీలతో వస్తూనే ఉంటామని, ప్రామిస్ అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు తమ కొత్త ప్రాజెక్టుల గురించి తెలిపారు. రక్త్ బ్రహ్మాండ్, గల్కండ టేల్స్, ఫ్యామిలీ మ్యాన్ 3 అని చెప్పారు.

ఇక రక్త్ బ్రహ్మాండ్ విషయానికొస్తే.. సిరీస్ లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ రేంజ్ లో మేకర్స్.. రూపొందిస్తున్నారు. 2025 చివరలో స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తోంది. కానీ దానిపై ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పుడు సిరీస్ క్యాన్సిల్ అంటూ వస్తున్న రూమర్లపై రాజ్, డీకే క్లారిటీ ఇచ్చారు. మరి ఎప్పుడు సిరీస్ ను తీసుకొస్తారో వేచి చూడాలి.