Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: భయంకర విలన్లపై నయన్ ఊచకోత

తన పర్మిషన్ లేకుండా వీడియో క్లిప్ ఉపయోగించడంపై ధనుష్ నయనతారకి లీగల్ నోటీసులు పంపించారు.

By:  Tupaki Desk   |   18 Nov 2024 5:57 AM GMT
టీజర్ టాక్: భయంకర విలన్లపై నయన్ ఊచకోత
X

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్, హీరో ధనుష్ మధ్య నడుస్తోన్న ఇష్యూ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నయనతార లైఫ్ స్టోరీకి సంబందించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ‘నేను రౌడీనే’ సినిమాకి సంబందించిన ఒక చిన్న వీడియో క్లిప్ ని ఉపయోగించారు. ఈ చిత్రాన్ని హీరో ధనుష్ నిర్మించారు. తన పర్మిషన్ లేకుండా వీడియో క్లిప్ ఉపయోగించడంపై ధనుష్ నయనతారకి లీగల్ నోటీసులు పంపించారు.


10 కోట్లు పరిహారంగా ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేశాడు. దీనిపై నయనతార ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ధనుష్ పైన తీవ్రంగా విమర్శలు చేసింది. ఇక నయనతార ఓపెన్ లెటర్ పై ధనుష్ అభిమానులు రియాక్ట్ అయ్యి ఆమెని టార్గెట్ చేస్తున్నారు. మరో వైపు నయనతార ఫ్యాన్స్ కూడా ధనుష్ ఫ్యాన్స్ కి సీరియస్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

ఇలాంటి సమయంలో నయనతార బర్త్ డే సందర్భంగా ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ముందుగా ఆమె యుద్ధం ప్రకటించింది అంటూ ఒక పోస్టర్ ని మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పోస్టర్ ధనుష్ ని ఉద్దేశించి ఆమె హెచ్చరికగా ఉందంటూ నయనతార ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యింది.

‘రక్కాయీ’ టైటిల్ తో సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ లో నయనతారని బిడ్డ తల్లిగా చూపించారు. ఆమె ఒక గుడిసెలో ఉంటుంది. అక్కడికి ఆమెని చంపడానికి రౌడీ మూకలు వస్తారు. గుడిసెలో బిడ్డ ఊయల్లో ఏడుస్తూ ఉంటుంది. మిరపకాయలు రోకలిలో దంచుతుంది. తరువాత బిడ్డకి పాలు పట్టి ఒక కొడవలిని వెదురు కర్రకి కట్టి బయటకొచ్చి ఎదురుగా నిలబడుతుంది.

తనపై దాడి చేయడానికి వచ్చేవారిపై ఎదురుదాడి చేసి ఊచకోత కొస్తుంది. గోవింద్ వసంత పవర్ ఫుల్ ఎలివేషన్ మ్యూజిక్ తో అదిరిపోయే విజువల్స్ తో ఈ టీజర్ ఉంది. టీజర్ లో నయనతార లుక్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ టీజర్ చూస్తుంటే పీరియాడికల్ యాక్షన్ మూవీ అని అర్ధమవుతోంది. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీవెర్స్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మూవీ టీజర్ ద్వారా రక్కాయీతో నయనతార ఏదో పెద్ద టార్గెట్ వేసిందని అర్ధమవుతోంది.