Begin typing your search above and press return to search.

ఢిల్లీ హైకోర్టులో స్టార్ హీరోకి మ‌రో షాక్!

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 20 లక్షల రూపాయల‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని రక్షిత్ శెట్టి, 'పరంవ స్టూడియోస్' కు ఆదేశాలిచ్చింది.

By:  Tupaki Desk   |   18 Aug 2024 12:30 PM GMT
ఢిల్లీ హైకోర్టులో  స్టార్ హీరోకి మ‌రో షాక్!
X

క‌న్న‌డ హీరో రక్షిత్ శెట్టి కాపీ రైట్ ఉల్లంఘన కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బెంగుళూరులోని యశ్వంత్ పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో రక్షిత్ శెట్టిని పిలిపించి పోలీసులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రక్షిత్ శెట్టి ఎమ్ ఆర్ టీ మ్యూజిక్ కంపెనీ మధ్య న్యాయ పరమైన వివాదం కొనసాగుతోంది. పరంవ స్టూడియోస్‌ నిర్మిస్తున్న 'బ్యాచిలర్‌ పార్టీ' సినిమాలో 'ఎమ్‌ఆర్‌టి మ్యూజిక్‌’కి చెందిన రెండు పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారని రక్షిత్ శెట్టిపై ఆరోపణలు వచ్చాయి.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 20 లక్షల రూపాయల‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని రక్షిత్ శెట్టి, 'పరంవ స్టూడియోస్' కు ఆదేశాలిచ్చింది. ఎమ్ ఆర్ టీ మ్యూజిక్ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న ద్వారా సమాచారాన్ని పంచుకుంది. 'బ్యాచిలర్ పార్టీ' కన్నడ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఆ సినిమాలో 'న్యాయ ఎల్లిదయా..', 'ఒమ్మే నేహిందే..' పాటలను వాడుకున్నందుకు 'ఎంఆర్‌టీ మ్యూజిక్‌’ రక్షిత్ శెట్టిపై కేసు పెట్టింది.

అయితే కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై కోర్టులో సమాధానం చెప్పాలని రక్షిత్ శెట్టి నిర్ణయించుకు న్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ రెండు పాటలను సినిమాలో వాడుకున్నట్లు వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు. తాజాగా వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది.

సినిమాలో అనుమతి లేకుండా పాటలను ఉపయోగించడమే కాకుండా పాటలోని శకలాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా రక్షిత్ శెట్టి, పరమవ స్టూడియోలు మరోసారి కాపీరైట్‌ను ఉల్లంఘిం చాయి' అని ఎమ్ ఆర్ టీ మ్యూజిక్ కంపెనీ కోర్టులో వాదించింది. ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ రక్షిత్ శెట్టి , పరమవ స్టూడియోస్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టు జ‌రిమినా విధించింది. మరి దీనిపై ర‌క్షిత్ శెట్టి రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. గ‌తంలో కూడా పాట‌ల ఉల్లంఘ‌న విష‌యంలో పలుమార్లు ర‌క్షిత్ శెట్టి కోర్టుకెళ్లిన సంద‌ర్భాలున్నాయి.