రక్షిత్ శెట్టి పెళ్లి! అమ్మాయి వివరాలు త్వరలో?
ఇదంతా కాస్త పాత సంగతే. ప్రస్తుతం రక్షిత్ కన్నడలో బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగులోనూ సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు
By: Tupaki Desk | 22 Sep 2023 7:08 AM GMTకన్నడ నటుడు రక్షిత్ శెట్టి టాలీవుడ్ కి సుపరిచితుడే. కొన్ని అనువాద చిత్రాలతో పరిచయమయ్యాడు. అటుపై రష్మిక మందన్న బోయ్ ప్రెండ్ గా ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఆమెతో నిశ్చితార్ధం..ఇక మెడలో మూడు ముళ్లు వేయడమే ఆలస్యం అనుకున్న సమయంలో సీన్ టర్నింగ్ తో రక్షిత్ తెలుగు నాటం మరింత వైరల్ అయ్యాడు. అప్పటి నుంచి యంగ్ హీరో గురించి ఏ విషయమైనా తెలుగులో ఆసక్తికరంగా మారుతుంది.
ఇదంతా కాస్త పాత సంగతే. ప్రస్తుతం రక్షిత్ కన్నడలో బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగులోనూ సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను నటించిన చిత్రాలు ఇక్కడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. రష్మిక మందన్నా కిపోటీగా ఇక్కడా రాణించాలని కసిగా ప్రయాణం మొదలు పెట్టాడు. కానీ ఇంకా ఆ జర్నీ పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అతడు ఇక్కడ సక్సెస్ అయితే సీన్ ఎలా ఉంటుందా? అని రక్షిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మరి రక్షిత్ ఇప్పుడు మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడా? ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో తిష్ట వేసిన రక్షిత్ ని పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా ఆడపిల్లలా మెలికలు తిగిరిపోయాడు. త్వరలోనే పెళ్లి అంటూ హింట్ ఇచ్చేసాడు. అమ్మాయి వివరాలు కూడా అతి త్వరలోనే రివీల్ చేస్తా అన్నాడు.
దీంతో రక్షిత్ లవ్ లో ఉన్నట్లు మీడియా కథనాలు ఊపందుకున్నాయి. అమ్మాయి రెడీగా లేకపోతే పెళ్లి అనగానే ఎందుకు సిగ్గుపడతాడు? అన్ని రకాలుగా సిద్దమైన తర్వాత తల ఊపాడు? అంటూ అభిమానులు నవ్వేస్తున్నారు. ఇది వీలైనంత త్వరగా జరగాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. రక్షిత్ శెట్టి-రష్మిక మందన్న లవ్ స్టోరీ...నిశ్చితార్దం..బ్రేకప్ సమయంలో ఎంత స్టోరీ నడించిందో తెలిసిందే. ఈవిషయంలో రష్మికదే తప్పంతా అని మెజార్టీ వర్గం సోషల్ మీడియా వేదికగా ఆమెని దూషించారు. ప్రతిగా రక్షిత్ శెట్టి ఆమెపై ఎలాంటి నిందలు వేయోద్దని కోరాడు. దీంతో హీరోపై సింపతీ మరింత పెరిగిపోయింది.