రక్షిత్ శెట్టి లవ్ స్టొరీ ట్విస్ట్.. ఫ్రెండ్ వల్లనే అలా..
ఇక కన్నడ ఇండస్ట్రీలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న రక్షిత్ శెట్టి కూడా పెళ్లి అడుగుల వరకు వెళ్లి ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాడు.
By: Tupaki Desk | 15 Nov 2023 3:30 AM GMTకొంతమంది సినీ తారల మధ్య ఎంత తొందరగా ప్రేమలు చిగురిస్తాయో అంతే తొందరగా కూడా బ్రేకప్ వరకు దారి మళ్ళిస్తాయి. ఇక ప్రస్తుత జనరేషన్ లో ఉన్న చాలామంది జీవితంలో బ్రేకప్ అనే పదాలను వినకుండా ఉండరు అని చెప్పవచ్చు. ఇక కన్నడ ఇండస్ట్రీలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న రక్షిత్ శెట్టి కూడా పెళ్లి అడుగుల వరకు వెళ్లి ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాడు.
హీరోయిన్ రష్మిక మందన్న తో అతని ప్రేమ వ్యవహారం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. చాలా తొందరగానే ప్రేమలో పడిన ఈ జంట అంతే తొందరగా కూడా బ్రేకప్ చెప్పేసుకుంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి వరకు వెళ్లిన వీరి ప్రయాణం ఆ తర్వాత ఎందుకు మళ్ళీ విడిపోయింది. ఆ తర్వాత ఎవరి దారిలో వారి కెరీర్లు కొనసాగిస్తూ ఉన్నారు.
అయితే అంతకంటే ముందు రక్షిత్ తన మొదటి ప్రేమలో ట్విస్ట్ ఎదుర్కొన్నట్లు తెలియజేశాడు. ఒక అమ్మాయిని కాలేజీ రోజుల్లో ప్రేమించిన స్టోరీని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అతను నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ బి అనే సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలుగులో రక్షిత్ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
అయితే అందులో అతని మొదటి ప్రేమ విషయాన్ని తెలియజేశాడు. కాలేజీ రోజుల్లో రోజు బస్సులో వెళుతుండగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఇక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని అనుకున్నాను. నాతో పాటే నా స్నేహితుడు కూడా ఎప్పుడూ నా పక్కనే ఉండేవాడు. అయితే ఒకరోజు లవ్ లెటర్ రాసి నువ్వే ఆ అమ్మాయికి ఇవ్వాలి అని స్నేహితుడికి చెప్పాను.
ఇక నా ఫ్రెండ్ ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత కాలం ఎంత గడిచినా కూడా ఆ అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కొంతకాలం ఊహించిన విధంగా నా ఫ్రెండ్ అలాగే ఆ అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ట్విస్ట్ నేను కలలో కూడా ఊహించలేదు అని రక్షిత్ శెట్టి తన మొదటి ప్రేమ విషయాన్ని అలా తెలియజేశాడు.