Begin typing your search above and press return to search.

రెండు భాగాల ప్రేమకథ.. నెల తేడాతో రిలీజ్..?

ఈ సినిమా సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. అదేంటి అనుకోవచ్చు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా తీశారు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 3:00 AM GMT
రెండు భాగాల ప్రేమకథ.. నెల తేడాతో రిలీజ్..?
X

కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 777 చార్లీ సినిమాతో వచ్చి సర్ ప్రైజ్ చేసిన రక్షిత్ తన నిర్మాణంలో ఒక క్రేజీ లవ్ స్టోరీ చేశాడు. ఆ సినిమానే సప్త సాగరదాచె ఎల్లో. ఈ సినిమాను హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేశారు. ఎప్పుడో ఏడాది క్రితమే ఈ సినిమా టీజర్ సందడి చేయగా ఈ ఇయర్ జూలై లోనే సినిమా రిలీజ్ అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా సప్త సాగరదాచె ఎల్లో సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. అదేంటి అనుకోవచ్చు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా తీశారు. ఈమధ్య ఇలా రెండు భాగాలుగా సినిమా చేయడం అన్నది కామన్ అయ్యింది. అయితే ఈ సినిమా స్పెషల్ ఏంటంటే సప్త సాగరదాచె ఎల్లో సినిమా రెండు పార్ట్ లను సైడ్ A సైడ్ B అంటూ నెల రోజుల్లోనే రిలీజ్ చేయబోతున్నారు. సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తుండగా సైడ్ B సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు.

రక్షిత్ శెట్టికి కన్నడలో స్టార్ క్రేజ్ ఉన్నా మిగతా భాషల్లో తన రేంజ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే సప్త సాగరదాచె ఎల్లో సినిమా కేవలం కన్నడలోనే రిలీజ్ అవుతుంది. ఇలా రెండు పార్ట్ లు ఒక నెల రోజుల తేడాలోనే రావడం రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే రెండు నెలల్లో రెండు భాగాలతో ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందించనున్నాడు.

రక్షిత్ శెట్టి అనగానే రష్మిక వ్యవహారం తెర మీదకు వస్తుంది. దర్శక నిర్మాత నటుడు అయిన రక్షిత్ శెట్టి చేసిన కిరాక్ పార్టీ తోనే రష్మిక మందన్న తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా తోనే అమ్మడు సూపర్ పాపులర్ కాగా ఆమెను రక్షిత్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని తెలిసిందే. ఆ తర్వాతనే రష్మిక తన కెరీర్ ని అంత త్వరగా ముగింపు పలకడం ఇష్టం లేక.. పెళ్లైతే ఎలాగైనా ఆంక్షలు ఉంటాయన్న కారణంతో రక్షిత్ తో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి నో చెప్పింది. కన్నడలో మాత్రం రక్షిత్ తన స్టార్ డం కొనసాగిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.